ఈ ఆహార‌ప‌దార్దాల‌తో చాలా జాగ్ర‌త్త ?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

food
Updated:  2018-10-01 03:20:01

ఈ ఆహార‌ప‌దార్దాల‌తో చాలా జాగ్ర‌త్త ?

చాలామంది ఇప్పుడు ప్ర‌స్తుత జీవ‌న శైలిలో బ‌య‌ట‌ ఫుడ్ కు అల‌వాటు ప‌డుతున్నారు.. ముఖ్యంగా ఈ అవుట్ సైడ్ ఫుడ్ జంక్ ఫుడ్ కు బానిస‌లుగా త‌యారు అవుతున్నారు... దీనికే  ఎక్కువ మంది అడిక్ట్ అవుతున్నారు అని ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలుతోంది.. అయితే శ‌రీరానికి ఎంతో చేటు చేయ‌డంలో ఈ అవుట్ సైడ్ ఫుడ్ ముందు ఉంటాయి.. అయితే డాక్ట‌ర్లు కొన్ని ఆహార ప‌దార్దాల‌కు దూరంగా ఉండాలి అని చెబుతున్నారు.. ..మీరు ఓ సారి ఆ ఆహార‌ప‌దార్దాల లిస్టు చూడండి.
 
వంటనూనెలు, నెయ్యి, వెన్న, వనస్పతి అంటే డాల్డా  వంటివి చాలా తక్కువగా వినియోగించాలి. ఎక్కువగా తీసుకుంటే కొవ్వు పెరిగి స్థూలకాయం తద్వారా గుండెజబ్బులు, కేన్సర్‌ లాంటివి వచ్చే ప్రమాదం ఉంది.....మాంసాహారులు మేక మాంసం, కోడి మాంసం బదులు చేపలు తీసుకోవడం మేలు. మాంసాహారంలోనూ లివర్‌, కిడ్నీ, బ్రెయిన్‌ వంటి పదార్థాలను మానుకోవడం మంచిది.
 
ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.... అలాగేరెండు మూడు రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవద్దు... విపరీతమైన ఉపవాసాలు లాంటివి చేయడం మంచిది కాదు. అలాగే చక్కెర, కొవ్వు పదార్థాలున్న ఆహారాన్ని, మద్యాన్ని తగ్గించాలి. వీటికి చాలా వ‌ర‌కూ దూరంగా ఉండ‌టం మంచిది...ఎక్కువ కొవ్వు ఉన్న పాలను తీసుకోవద్దు. ఫ్యాట్ శాతం త‌క్కువ ఉన్నా పాల‌ను తీసుకోవాలి.
 
ఊరగాయలు, ఉప్పు, బిస్కెట్లు, చిప్స్‌, వెన్న, పిజ్జా, శీతలపానీయాలు, ప్రాసెస్‌ చేసిన పదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి... అలాగే బరువు పెరగకుండా చూసుకోవాలి.మంచి ఆరోగ్యం కోసం... రోజూ ధ్యానం, యోగాభ్యాసం వంటి వాటితో ఒత్తిడిని తగ్గించుకోవాలి.. రోజూ తప్పని సరిగా వ్యాయామం చేయాలి...పొగ తాగడం, పోగాకు నమలడం, గుట్కా, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి... వంట‌లు చేసే ముందు కూరగాయలు, పండ్లు శుభ్రంగా కడగాలి. ఇలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోని, ఇలాంటి జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండ‌టం మంచిది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.