ఈ ఆసనంతో కొవ్వు మాయం

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

fat
Updated:  2018-06-14 01:29:13

ఈ ఆసనంతో కొవ్వు మాయం

ప్రతి రోజు కటి చక్రాసనం వేస్తె మన శరీరంలో ఉండే అదనపు కొవ్వును కరిగించవచ్చు..ఈ ఆసనం వల్ల సులభంగా తొడ భాగంలోని కొవ్వును, నడుము భాగంలోని కొవ్వును, తుంటలలోని కొవ్వును కరిగించవచ్చు...కటి అంటే నడుము. కటిని తిప్పే ఈ ఆసనాన్ని కటి చక్రాసనం అంటారు. దీని వలన శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.... 
 
ఆసనం ఎలా వేయాలంటే :
 
సమాంతరంగా ఉన్న నేలపై నిటారుగా నిలబడాలి. 
 
తల వెనుకభాగం సమాంతరంగా ఉండేలా చూడాలి. 
 
మన చూపు ఎదురుగా ఉండాలి.
 
చేతులను ముందుకు చాపాలి. 
 
అలాగే రెండు కాళ్ళ మధ్య కనీసం అరమీటరు దూరం ఉండేలా చూసుకోవాలి. 
 
ఎడమ చేతిని కుడి భుజంపైకి, కుడిభుజాన్ని వెనుకకు మడవాలి.
 
అలాగే కుడిచేతిని ఎడమ భుజంపైకి, ఎడమ భుజాన్ని వెనుకకు మడవాలి. 
 
కుడి భుజంపై నుంచి వీలైనంత వరకు చూడాలి. 
 
ఇలాగే కొన్ని సెకనులు నిలబడాలి. కొద్దిసేపటి తర్వాత నుండు ఉన్న స్థితికి రావాలి...
 
ఇదే విధంగా రెండోవైపు కూడా చేయాలి. ఇలా కనీసం 5 సార్లు చేయాలి. 
 
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
భుజం, నడుము నొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయకపోవడం మంచిది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.