జంట అరటిపండ్లను తింటే కవలలు పుడతార?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

bananas
Updated:  2018-07-23 06:14:24

జంట అరటిపండ్లను తింటే కవలలు పుడతార?

కడుపుతో ఉన్నవాళ్లు… జంట అరటిపండ్లను తింటే కవలలు పుడతారనే నమ్మకాన్ని కేవలం ఇండియన్సే కాదు….ఫిలిప్పైన్స్ దేశీయులు కూడా బలంగా నమ్ముతారు. ప్రెగ్నెంట్ లేడి…. తన గర్భకాలంలో తొలి మూడు నెలల్లో ఈ జంట అరటి పండ్లను తింటే వారికి ఖచ్చితంగా కవలలే పుడతారనే నమ్మకం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే సైంటిఫిక్ గా ఇది నిరూపితం కానప్పటికీ…దీనిని బలపరిచేందుకు మాత్రం ఓ సైన్స్ లాజిక్ మాత్రం పనికొస్తుంది.
 
సాధారణంగా అరటి పండును పోటాషియమ్ గని అంటారు. ఒక్క అరటి పండు తింటే….ఒక రోజులో మన శరీరానికి కావాల్సిన 20% పొటాషియమ్ లభిస్తుంది. ఇక గర్భిణీలకు పొటాషియమ్ అవసరమే కానీ పోటాషియమ్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. ఒక్క అరటిపండు తింటేనే 450 మి.గ్రాముల పొటాషియమ్ లభిస్తుంది. అదే జంట అరటి పండైతే…..900MG పొటాషియమ్….అంటే ఒక రోజులో మనకు కావాల్సిన పొటాషియమ్ లో కేవలం అరటిపండు నుండే 40% తీసుకున్నట్టు లెక్క…ఇతర ఆహార పదార్థాల ద్వారా కూడా పెద్ద మొత్తంలోనే పొటాషియం అందుతుంది.
 
ఇది గర్భిణీ మహిళల మీద అధిక ప్రభావాన్ని చూపుతుంది. వాళ్లకు పుట్టబోయే పిల్లలపై కూడా… అందుకే గర్భిణిలు ఎక్కువగా అరటి పండ్లను తినకూడదని, జంట అరటి పండ్లను తీసుకుంటే కవలలు పుడతారనే ఓ రకమైన భయాన్ని సృష్టించారని చెప్పవొచ్చు. కొంతమంది కవలలు కావాలనే జంట అరటి పండ్లును వెతికివెతికి మరీ తింటారు.! అది వేరే విషయం.
 
 ఓ ఛానల్ .. ఇంటర్వ్యూలో  యాంకర్ ఉదయభాను….”జంట అరటి పండ్లు, వంకాయలు తింటే కవలలు పుడతారని విన్నప్పటి నుండి కావాలనే జంట అరటి పండ్లను, జంట వంకాయలను వెతికి మరీ తినేదాన్ని.. అందుకేనేమో నాకు కవలలు పుట్టారు” అని చెప్పారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.