యోగా చరిత్ర

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

yoga history
Updated:  2018-06-14 12:10:47

యోగా చరిత్ర

యోగ ఇప్పుడు పుట్టింది కాదు...సుమారు 5000 సంవత్సరాల క్రితమే ఆచరణలో ఉందని ఆధారాలు కూడా ఉన్నాయి...సింధు నాగరికత కాలం నాటికీ యోగా ఆచరణలో ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి..పూర్వం మహార్సులు హిమాలయాల్లో అనేక రకాల హాసనాలతో తపస్సు చేసేవారు..ఆ ఆసనాలన్నింటిని పతంజలి ఒక చోట చేర్చి, యోగాకు ఒక రూపునిచ్చాడు పతంజలి...అందుకే పతంజలిని యోగా పితామహుడిగా అభివర్ణిస్తారు. 
 
ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో యోగ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేలా చేసింది మాత్రం బి.కె.ఎస్. అయ్యంగార్...అయన కృషి వల్ల ప్రపంచదేశాలతో యోగాకు మంచి గుర్తింపు వచ్చింది..అయ్యంగార్ యోగాపై ఎన్నో పరిశోధనలు చేసి, ఎన్నో పుస్తకాలను కూడా రాసారు...ఎప్పుడు ఎంతో మంది యోగ ఉపాధ్యాయులు ఎన్నో కొత్త పద్దతులను కనిపెట్టి ప్రంపంచంలో యోగ స్థాయిని పెంచుతున్నారు...
 
పతంజలి అష్టాంగ యోగం... యోగాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు...పతంజలి అష్టాంగయోగంలో ఎనిమిది మెట్లు ఉంటాయి. వీటి ద్వారా మనోశక్తిని పెంపొందించుకోవచ్చు. అవే.. యమ, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. దీని ద్వారా ఏకాగ్రత పెరిగి, ఆలోచన విధానంలో మార్పు వస్తుంది..ఒత్తిడిని తగ్గిస్తుంది..ఆరోగ్యపరమైన సమస్యలను దూరం చేస్తుంది...
 
యోగ అనేది మతాలు ఏర్పడకముందే పుట్టింది..అందుకే కుల మతాలకు అతీతంగా అన్ని సమాజాల్లోనూ యోగాసనాలు ఉన్నాయి. బౌద్ధం, జైన, ఇస్లాం సమాజాల్లోనూ అనేక యోగాసనాలు ఉన్నాయి.అల్ బెరూనీ భారతదేశంలో పర్యటించి 11 వ శతాబ్దంలో పతంజలి యోగసూత్రాలను పర్షియన్‌భాషలోకి అనువదించాడు...గత సంవత్సరం నిర్వహించిన అంతర్జాతీయ యోగా డేలో సుమారు 47 ముస్లిం దేశాలు కూడా పాల్గొనడం ఆహ్వానించదగ్గ పరిణామం..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.