మీరు యంగ్ గా క‌న‌బ‌డాలంటే ఈచిట్కాలు మీకోసం ?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

younger
Updated:  2018-07-13 05:46:39

మీరు యంగ్ గా క‌న‌బ‌డాలంటే ఈచిట్కాలు మీకోసం ?

కొంత మంది వ‌య‌సు ఎంత అంటే చెప్ప‌డానికి సిగ్గుప‌డ‌తారు.. అంతేకాదు వారి వ‌య‌సుని కూడా చాలా త‌క్కువ‌గా చెప్పుకుంటారు.. అస‌లు వారి వ‌య‌సుకి వారు చెప్పేదానికి పొంత‌న లేకుండా చెబుతారు....చాలా మంది పెద్ద‌వయ‌సులో కూడా, వారి మెయింటెనెన్స్ తో యంగ్ గా క‌నిపిస్తారు.. అలాగే వారి యంగ్ లుక్ కోసం అనేక చిట్కాలు ఫాలోఅవుతారు.. వ‌య‌సు ఎంత మీద‌కు వ‌స్తున్నా, యంగ్ లుక్ కోసం ఆరాట‌ప‌డ‌తారు.. ఇక వారి పిల్ల‌ల కంటే మ‌న‌మే యంగ్ గా క‌నిపించాలి అనే కోరిక కూడా వారిలో బలంగా ఉంటుంది. 
 
అయితే ఇలాంటి వారు అప్ప‌టిక‌ప్పుడు చూపించే లుక్ కాదు ఇది... ఎందుకంటే ఆ లుక్ రావాలి అంటే వారు ఎప్ప‌టి నుంచో దానిమీద కాన్స‌న్ట్రేష‌న్ చేసి ఉండాలి.. అందుకే ఆ నేచ‌ర‌ల్ లుక్ ని యంగ్ లుక్ ని పొందుతారు.. వ‌య‌సు ఎంత మీద ప‌డుతున్నా, వారి యంగ్ లుక్ మాత్రం అలానే ఉంటుంది.. ఉదాహ‌ర‌ణ‌కు తీసుకుంటే సినీ రంగం.. అయితే 70 ఏళ్లు వ‌చ్చినా స‌రే, యంగ్ లుక్ తో క‌నిపిస్తారు హీరోలు -హీరోయిన్లు.. వారి మేక‌ప్ కారణం కావ‌చ్చు, వారి ఆహార‌నియ‌మాలు కావ‌చ్చు.. ఏమైనా వారు చూడ‌టానికి యువ‌త‌లా ఉంటారు.. అయితే ఇలా మీరు యంగ్ గా క‌నిపించాలి అంటే,  కొన్ని చిట్కాలు చెప్పుకుందాం. అవేంటో తెలుసుకోండి.
 
చాలా మంది  తమకంటే వయసులో చిన్న వారి కంటే శారీరకంగా, మానసికంగా చాలా యాక్టివ్‌గా ఉంటారు. దానికి కారణం వారు చిన్న వయసు నుంచి వ్యాయామం చేయడమేనట. అలా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్లే ఇది సాధ్యమవుతుందట. కేవలం యంగ్‌గా ఉన్నామనే భావనే కాకుండా వారు నిజంగానే యంగ్‌గా ఉంటారట.
 
ఎక్కువగా రన్నింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ వంటి వ్యాయామాలు చేయడం వల్ల కాళ్లు, చేతుల్లో ఉన్న కండరాలు బలపడతాయట. అలాగే వారి కండర కణాలు కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయట. కెనడాలోని ఒంటారియోలో గల యూనివర్సిటీ ఆఫ్‌ గ్యుల్ఫ్ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాయామం చేయని వారితో పోల్చుకుంటే చేసే వారి కాళ్ల, చేతుల కండరాలు 25 శాతం బలిష్టంగా ఉంటాయని తేలింది. యుక్త వయసులో ఉన్నప్పుడు అథ్లెట్లైన వారు సులభంగా 80, 90 సంవత్సరాలు ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేకుండా గడిపేస్తారట. అలాగే వీరు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ.. వ్యాయామం చేయని యువకుల కంటే శారీరకంగా ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారట. ఇక ఆహార నియ‌మాలు కూడా పాటించ‌డం, మితంగా ఆహారం తిన‌డం, ప‌ళ్లు చిరుదాన్యాలు ఫాట్ లేని ఫుడ్స్  వ‌ల్ల కూడా వారు యాక్టివ్ గా ఉండి. కాస్త యంగ్ లుక్ పొందుతార‌ట‌.. ఈ చిట్కాలు మీరు ఫాలో అయి యంగ్ గా క‌నిపించండి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.