అమ్మో, మొటిమా? ఇలా చేసి చూడండి

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

Updated:  2018-01-20 10:40:46

అమ్మో, మొటిమా? ఇలా చేసి చూడండి

అమ్మాయి అందమైన మోముపై చిన్న మొటిమ చిత్ర హింస చేస్తుంది. కానీ కొంతమందికి మొహం అంతా మొటిమలు వ్యాపించి ఇబ్బంది పెడతాయి. అంద విహీనంగా మారుస్తాయి. అలాంటప్పుడు చిన్న చిన్న ఇంటి వైద్యాలు ఎంతో సహకరిస్తాయి

మొటిమల్ని గిచ్చటం, పదే పదే ముట్టుకోటం చేయొద్దు.. బాగా బయట తిరిగొచ్చాక చేతులు కడుక్కోకుండా ముఖం రుద్దుకోకూడదు. రోజు రెండుసార్లు ముఖం శుభ్రంగా కడుక్కోవాలి.

నాలుగు-ఐదు వేపాకులు తీసుకుని మెత్తగా నూరి దానికి పెరుగు చేర్చి మొటిమలున్న చోట రాస్తే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు కూడా తగ్గు ముఖం పడతాయి.

పుల్లటి పెరుగు, కొంచెం పసుపు, ఒక స్పూన్ కొబ్బరి నూనె కలిపి ముఖం పైన మసాజ్ చేసి కాసేపయ్యాక కడగాలి తరచూ ఇలా చేస్తూ ఉంటె మొటిమలు పోతాయి.

టేబుల్ స్పూన్ పాలు, టీ స్పూన్ శనగపిండి, టీ స్పూన్ పసుపు కలిపి మెత్తని పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే రాసుకోవాలి. 

బంగాళాదుంప పేస్టును పాలతో కలిపి లేదా డైరెక్ట్ గా ఐన ముఖానికి పట్టించాలి.. ఇలా చేయటం వలన మొటిమలే కాదు కాళ్ళ కింద నల్లటి వలయాలు కూడా తగ్గుతాయి.

వేప, పుదీనా ఆకులు కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని మొటిమల మీద రాసి అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. 

గంధాన్ని అరగదీసి దానికి చెంచా గులాబీ రేకుల పొడి, టీ స్పూన్ పాలు, తేనే కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయటం వలన మొటిమలను నియంత్రించొచ్చు.

బొప్పాయి గుజ్జులో చెంచా తేనె, చెంచా పాలు తగినంత తులసి పొడి కలుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం ప్యాక్ లా వేస్తుంటే మొటిమలు అదుపులో ఉంటాయి.

 

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.