కిడ్నీ లో రాళ్ళు ఏర్పడకుండా ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

kidney
Updated:  2018-10-01 01:00:52

కిడ్నీ లో రాళ్ళు ఏర్పడకుండా ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి?

ఇటీవ‌ల కాలంలో మ‌న‌కు అనేక స‌మ‌స్య‌లు వెక్కిరిస్తున్నాయి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అనేక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు చాలా మంది. మ‌న‌కు గుండె త‌ర్వాత ఎంతో ముఖ్య‌మైంది కిడ్నీలు, ఇవి స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే క‌చ్చితంగా ప్రాణానికి ముప్పే అని చెప్పాలి. శ‌రీరంలో ప్ర‌ధాన క్రియ‌లు అన్ని కిడ్నీలే చేస్తాయి.
 
శరీరంలోని రసాయనాల సమ తుల్యతను కాపాడటం, వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి తొలగించడం, వివిధ రకాల హార్మోన్లను విడుదల చేయడం.... శరీరంలోని ద్రవాలను తొలగించడం లేదా నిలువరించడం మూత్రపిండాలు చేసే విధులలో ప్రధానమైనవి. మూత్ర‌పిండాలు స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే క‌చ్చితంగా శ‌రీరం ఉబ్బుతుంది ముఖం కాళ్లు చేతులు ఉబ్బిన‌ట్టు క‌నిపిస్తాయి. ఇక అలాగే చాలా మందికి ఇప్పుడు వేధించే స‌మ‌స్య కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డ‌టం.ఈ స‌మ‌స్య వ‌య‌సుతో సంబంధం లేదు చాలా మందికి వ‌స్తోంది... 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. స్త్రీల‌లో కంటే పురుషుల్లో ఈ స‌మ‌స్య ఎక్కువ వేధిస్తూ ఉంటుంది.
 
1.మంచి నీళ్ళను ఎక్కువ‌గా తాగాలి. దీనివల్ల మూత్రం పల్చబడుతుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల సాల్ట్స్, ఖనిజ లవణాలు కాన్సెంట్రేట్ కాకుండా ఉండి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. రోజూ సుమారున రెండు మూడు లీటర్లు నీరు తాగడం మంచిది. వేసవి కాలంలో ఇంకా ఎక్కువ తాగాలి.
 
2.కిడ్నీలో ఏర్పడే రాళ్ళలో 92 శాతం కాల్షియం మూలంగానూ, కాల్షియం ఉత్పత్తుల మూలంగానూ ఏర్పడుతుంటాయి. కాబట్టి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉన్న వాళ్ళు కాల్షీయం ఉత్పత్తుల్ని పూర్తిగా మానేయకూడదు. గాని తగు మోతాదులో మితంగా మాత్రమే తీసుకోవాలి. డెయిరీ ఫుడ్స్ ఎక్కువ‌గా తీసుకోవాలి.
 
3. యాంటీ బ‌యోటిక్స్ కూడా వాడ‌కుండా ఉండ‌టం మంచిది
 
4.. అధికంగా మందులు వాడినా ఇది మంచిది కాదు
 
5.. శ‌రీరానికి రక్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌ర‌గాలి కాబట్టి వ్యాయామం చేయాలి, అలాగే వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరానికి మంచిది ఇలా చేయ‌డం వ‌ల్ల కిడ్నిలో స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.
 
6.. విటమిన్ సి కాల్షియం స్టోన్స్ ముఖ్యంగా యూరిక్ యాసిడ్, ఉంటే మాంసాహారం ద్వారా మీరు తీసుకునే ప్రొటీన్ పరిమాణాన్ని తగ్గించండి.
 
7. మూత్రం పోస్తున్నప్పుడు దానినుంచి రాయి పడితే ఆ రాయిని సేకరించి భద్రంగా దాన్ని డాక్టర్లకు చూపించితే వారు దానిని లాబొరేటరికి పంపించి ప‌రిశీలిస్తారు.. అలాంటివి ముందు ముందు ఇంకా ఏర్పడకుండా తగు వైద్యాన్ని సూచించుతారు.
 
8.. ఇక డ్రింకులు కూల్ డ్రింక్స్ వంటి వాటికి ఆల్కాహాలుకు దూరంగా ఉండాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.