కంటిచూపు కోసం ముందుగానే ఈ జాగ్ర‌త్తలు..?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

eyes
Updated:  2018-10-01 03:10:38

కంటిచూపు కోసం ముందుగానే ఈ జాగ్ర‌త్తలు..?

కంటిచూపు బాగోవాలి అని ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు మ‌న‌లో చాలా మంది.. ముఖ్యంగా వ‌య‌సు పెరిగే కొద్దీ చాలా మందికి కంటిచూపు మంద‌గిస్తుంది.. అయితే ముందుచూపుతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, కంటి సమస్యలు అంత త్వరగా దరిచేరవు అంటున్నారు వైద్యులు.. కంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
 
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, జింక్‌, విటమిన్‌ సి, ఇ వంటివి శ‌రీరానికి అలాగే తీసుకోవాలి.... మీ శరీరంలో ఇవి తక్కువగా ఉన్నాయేమో చూడాలి...ముఖ్యంగా ఆహారంలో తాజా ఆకుకూర‌లు కూర‌గాయ‌లు తీసుకోవాలి..త‌ర‌చూ పాలకూర, తోటకూర, చుక్కకూర వంటివన్నీ తరచూ తింటుండాలి. 
 
విటమిన్‌-ఇ చేపల్లో ఎక్కువ. అన్ని సీజన్లలోను చేపలు దొరుకుతాయి కాబట్టి.. వీటిని తీసుకోవచ్చు. అయితే చేపలతో వేపుళ్లు కాకుండా.. కూరలు చేసుకు తినడం వల్ల చక్కటి ఫలితం లభిస్తుంది. అలాగే కోడిగుడ్లు, గింజలు, పప్పుధాన్యాలు, బీన్స్‌, ఆరంజ్‌లతోపాటు సిట్రస్‌ జాతికి చెందిన పండ్లను ఎక్కువ‌గా తీసుకోవాలి. కంటిచూపుకు ఒబెసిటీకి సంబంధం ఉంది. అందుకే బరువు పెరగకుండా చూసుకోవాలి. బరువు పెరిగితే బీపీ, షుగర్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటి వల్ల కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది... కనీసం ఆర్నెళ్లకు ఒకసారి అయినా బరువును చెక్‌ చేసుకోవాలి. 
 
బీడీలు, సిగరెట్లు, చుట్టలు, హుక్కా వంటివి తాగడం వల్ల కాటరాక్ట్‌ వచ్చే ప్రమాదం ఉంది.... పొగ పీల్చేవాళ్లలో నరాల జబ్బులు వస్తాయి. తద్వారా కంటిచూపుకు చిక్కులొస్తాయి. కాబట్టి వెంటనే పొగతాగడం తగ్గించండి. మెల్లగా మానేసేందుకు గట్టి నిర్ణయం తీసుకోవాలి..ఇక ఎండ‌లో వెళ్లిన స‌మ‌యంలో స‌న్ గ్లాసెస్ పెట్టుకోవాలి... ళ్ల‌ల్లో ధూళి ప‌డ‌కుండా చూసుకోవాలి.. పొగ‌కూడా కంటికి త‌గ‌ల‌కుండా చూసుకోవాలి. కంప్యూటర్‌ మీద పని చేస్తే.. కళ్లు అలసిపోతాయి. చూపు బ్లర్‌గా కనిపిస్తుంది. కళ్లు పొడిగా మారిపోతాయి. తలనొప్పి, మెడనొప్పి, వెన్ను నొప్పిలతో పాటు భుజాలు లాగేస్తాయి. క‌చ్చితంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కళ్లకు విశ్రాంతిని ఇవ్వాలి.... పదిహేను నిమిషాల పాటు కళ్లు మూసుకుంటే మంచిది. కంప్యూటర్‌ మానిటర్‌కు కాస్త డిస్టెన్స్‌ మెయింటెన్‌ చేయాలి. ఇలా చేస్తే క‌చ్చితంగా క‌ళ్ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కంటి చూపు బాగోవాలి అంటే ముందు నుంచి ఇటువంటి విధానాలు, జాగ్ర‌త్త‌లు  పాటించాలి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.