క‌ళ్ల సంరక్షణకు ఈ ఐదు టిప్స్ పాటించండి?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

eyes
Updated:  2018-09-11 06:09:10

క‌ళ్ల సంరక్షణకు ఈ ఐదు టిప్స్ పాటించండి?

మ‌న శ‌రీరంలో అత్య‌ధికంగా కాళ్లు-  క‌ళ్లు ఒత్తిడికి గురి అవుతూ ఉంటాయి.. కళ్లు తీవ్ర‌మైన ఒత్తిడికి గురి కావ‌డం అనేది వేస‌విలో మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. వేస‌విలో ఈ ఒత్తిడి వ‌ల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి అవి ఎరుపెక్కడం, వాపులకు లోనవడం, కళ్ల కింద నల్లని వలయాలు రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే  ఈ టిప్స్ పాటించి క‌ళ్ల‌ను సంర‌క్షించుకోవ‌చ్చు అంటున్నారు వైద్యులు... అవేంటో ఇప్పుడు చూద్దాం
 
ఎండలో తిరిగి ఇంటికి వచ్చాక చల్లని నీటితో ముఖాన్ని, కళ్లను బాగా కడగాలి. త‌ర్వాత చల్లని నీటిలో ముంచిన కాటన్ ప్యాడ్స్‌ను కళ్లపై 10 నిమిషాల పాటు పెట్టుకోవాలి. దీంతో కళ్ల రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. కళ్లు ఫ్రెష్‌గా మారుతాయి. 
 
అలోవెరా జ్యూస్‌ను ఫ్రిజ్‌లో ఐస్ క్యూబ్స్ ట్రేలో పోసి గడ్డ‌ కట్టించాలి. అనంతరం ఆ క్యూబ్స్‌ను కళ్లపై మర్దనా చేసినట్టు రాయాలి. ఇలా 5 నుంచి 10 నిమిషాల పాటు కళ్లపై ఒత్తిడి పోయే వరకు చేయాలి. దీంతో కళ్లు తాజాగా మారుతాయి. కంటి సమస్యలు పోతాయి. 
 
వేసవిలో కళ్లపై పడే ఒత్తిడిని తగ్గించేందుకు కీరదోస బాగా పనిచేస్తుంది. కీరదోసను రెండు చక్రాల్లా కోసి కళ్లపై పెట్టుకుని 20  నిమిషాల పాటు అలాగే ఉండాలి. దీంతో కళ్లలో ఉండే రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. కళ్లపై పడే ఒత్తిడి తగ్గుతుంది. రోజూ ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక కీర ముక్క‌లు రౌండుగా కోసి  ఓ ఇర‌వైనిమిషాలు అయినా క‌ళ్ల‌పై పెట్టుంటే ఒత్