చ‌ర్మ సౌందర్యం పెర‌గాలంటే ఇవి త‌ప్ప‌క తీసుకోండి?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

beauty
Updated:  2018-10-24 03:12:34

చ‌ర్మ సౌందర్యం పెర‌గాలంటే ఇవి త‌ప్ప‌క తీసుకోండి?

చ‌ర్మం కాంతి వంతంగా క‌నిపించాలి అని, చ‌ర్మం నిగారింపు ఉండాలి అని,  చ‌ర్మానికి ఎన్నో శ్ర‌ద్ద‌లు ఆరోగ్య జాగ్ర‌త్త‌లు తీసుకుంటాం. చ‌ర్మం పొడిబారినా కాంతి హీనంగా క‌నిపించినా చాలా మందికి న‌చ్చదు... అందుకే కాంతి వంతంగా క‌నిపించ‌డానికి అనేక టిప్స్ ఫాలో అవుతాం. అయితే చ‌ర్మ సౌంద‌ర్యం పెర‌గాలి అంటే ఈ ఆహార‌ప‌దార్దాలు తీసుకుంటే మంచిది అని అంటున్నారు నిపుణులు..... ఇక ఆ ఆహార ప‌దార్దాలు ఏమిటో చూద్దాం..
 
విటమిన్‌ ఎ, బీటా కెరాటిన్‌లు పాల‌కూర‌లో పుష్క‌లంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయల‌ను రాకుండా చూస్తాయి. చర్మాన్ని కాపాడతాయి. పాల‌కూర‌ను రోజూ ఆహారంలో తీసుకుంటే నలభైలలో కూడా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు స‌బ్జా గింజ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని ర‌క్షిస్తాయి. అలాగే చ‌ర్మ సౌంద‌ర్యానికి ట‌మోటాలు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.. ఇది చ‌ర్మానికి మంచి మెరుపును అందిస్తుంది... యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ట‌మాటాల్లో ఉంటాయి. ఇవి కాలుష్యం, హానికార‌క సూర్య కిర‌ణాల నుంచి మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. చ‌ర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. 
 
చర్మ సౌందర్యానికి ఎంత‌గానో అవసరమయ్యే విటమిన్‌ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు బాదం ప‌ప్పుల్లో పుష్కలంగా ఉంటాయి. రోజూ నాలుగు బాదం పప్పుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మంచిది.. క్యారెట్స్ లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది.. ఇంకా ఇందులో ఉండే బీటా కెరోటీన్‌ అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు ఇవ్వడంతో పాటు చర్మానికి, కురులకు మంచి ప్రయోజనాలను చేకూర్చుతుంది. అందుకే చ‌ర్మానికి ఎంతో మంచి చేస్తుంది కాబ‌ట్టి రోజూ క్యారెట్ తిన‌డం జ్యూస్ తాగ‌డం మంచిది. అలాగే బొప్పాయి కూడా మంచి ఆరోగ్యానికి చ‌క్క‌ని ఫ్రూట్ అని చెప్ప‌వ‌చ్చు.... నిమ్మ కూడా శ‌రీరంలో మ‌లినాల‌కు పొగొడుతుంది... ఇక కీర‌దోస కూడా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్ని ఇస్తుంది. ఇది కంటి కింద భాగంలో పెట్టుకుంటే కంటి కింద మ‌చ్చ‌లు కూడా దూరం అవుతాయి.

షేర్ :

Comments

0 Comment