సుఖనిద్రకు ఈ చిట్కాలు పాటించండి ?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

sleep
Updated:  2018-07-11 03:05:45

సుఖనిద్రకు ఈ చిట్కాలు పాటించండి ?

గతంలో కంటే ఇప్పుడు జీవ‌న‌శైలి చాలా వ‌ర‌కూ మారిపోయింది.. ఈ ఉరుకుల ప‌రుగుల యాంత్రీక‌ర‌ణ జీవ‌నం లో ప‌రుగులు పెడుతూ నిత్యం ఉద్యోగాల్లో లీన‌మ‌వుతున్నారు. గ‌తంలో కంటే ఇప్పుడు కూర్చేని ప‌నికి మార్కెట్లో తిరిగే ఉద్యోగాల‌కు ఎక్కువ స‌మ‌యం కేటాయించ‌డం, వారానికి ఓ సారి దొరికే రిలీఫ్ తో సుఖ‌మైన జీవితాన్ని పొంద‌లేక‌పోతున్నారు ప్ర‌జ‌లు.
 
ఈ యంత్రీక‌ర‌ణ జీవితంలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.. అలాంటి వారికి రాత్రిపూట నిద్ర పట్టదు.. రకరకాల సమస్యలు మెదళ్లను తొలిచేస్తుంటాయి. సుఖనిద్ర సరే తగినంత నిద్ర లేక అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి... మనం హాయిగా నిద్ర పోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. అవేమిటంటే.
 
పడకగదిలో అందరూ బెడ్‌లైట్‌ను వాడుతుండడం మామూలే. అవి రకరకాల రంగులలో లభ్యమవుతుంటాయి. అయితే వాటిలో ఆకుపచ్చ రంగు లైట్‌ను వాడితే మనకు బాగా నిద్రపడుతుందట. మీరూ ట్రై చేయండి..
బ‌య‌ట‌ నుంచి వచ్చే ప్రకృతి గాలిని ఆస్వాదించడం అందరికీ ఇష్టమే. అందుకే తలుపులు లేదా కిటికీలకు దగ్గరగా తమ బెడ్‌ను ఏర్పాటుచేసుకుంటారు. అయితే అది మంచిది కాదని నిపుణులంటున్నారు. మనం హాయిగా నిద్ర పోవాలంటే, కిటికీలు లేని వైపు గోడకు ఆనుకుని మన బెడ్‌ను అమర్చుకుంటే నిద్ర బాగా పడుతుందట.