నడుము నొప్పా ఈ చిట్కాలు పాటించండి

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

back pain
Updated:  2018-10-01 05:47:36

నడుము నొప్పా ఈ చిట్కాలు పాటించండి

చాలా మందికి న‌డుము నొప్పి తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది... దీనికి ప‌లు కార‌ణాలు ఉన్నాయి, అత్య‌ధికంగా ఒత్తిడి శ్ర‌మ ఎక్కువ సేపు న‌డుం వంచి ప‌నిచేయ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య వేధిస్తూ ఉంటుంది... అయితే కండ‌రాల ప‌ట్టు త‌ప్ప‌డం వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంది. ముఖ్యంగా వెన్ను స‌మ‌స్య ఉన్న‌వారికి మ‌రింత స‌మ‌స్య‌గా ఉంటుంది న‌డుం నొప్పి. ఇక పీరియ‌డ్స్ స‌మ‌యంలో మ‌హిళ‌లు త‌ట్టుకోలేని న‌డుం నొప్పి ఎదుర్కొంటారు.
 
అయితే ఇంగ్లీష్ మందులు ఎక్సైర్ సైజ్ల‌తో పాటు కొన్ని చ‌క్క‌ని ఇంటి చిట్కాలు పాటించిన‌ట్లు అయితే, నడుం నొప్పి క‌చ్చితంగా త‌గ్గుతుందని  తెలియ‌చేస్తున్నారు... ఆచిట్కాలు ఏమిటో చూద్దాం?
 
ప్రతి రోజూ పది చుక్కలు వెల్లుల్లి రసం పావు గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. అల్లం రసం, పసుపు కలిపి పాలతో తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. ఆవ నూనె, నువ్వుల నూనె వేడి చేసి నడుముకు మర్దన చేసుకుని వేడి నీళ్ళతో స్నానం చేస్తే నడుంనొప్పి తగ్గుముఖం ప‌డుతుంది.
 
అలాగే కూర‌గాయ వంకాయ, వేరుసెనగ నూనె, మినప పదార్థాలు, పెరుగులను నడుము నొప్పితో బాధపడేవారు ఎక్కువుగా తీసుకోవడం మంచిది కాదు....ఒళ్ళు లావుగా వుండి నడుం నొప్పి వుంటే, పావుగ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఇరవై చుక్కలు నిమ్మపండు రసం పోసి పరగడుపున తాగుతుంటే, ఒళ్ళు తేలికపడి నొప్పి తగ్గుతుంది. ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కను పల్చటి గుడ్డలో కట్టి, మూకుడులో ఆవు నెయ్యి వేసి కాచి అందులో ఈ కట్టిన గుడ్డను ముంచి నడుం చుట్టూ కాపడం పెడుతుంటే, నడుంనొప్పి తగ్గిపోతుంది. ఇక కొబ్బ‌రి నూనెను ఆవ నూనెను స్నానం చేసిన త‌ర్వాత ఆ న‌డుం నొప్పి ప్రాంతంలో రాసినా  ఈ న‌డుం నొప్పి స‌మ‌స్య త‌గ్గుతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.