శరీరంలో వేడి త‌గ్గాలి అంటే ఈ చిట్కాలు పాటించండి?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

body heat
Updated:  2018-10-01 15:03:11

శరీరంలో వేడి త‌గ్గాలి అంటే ఈ చిట్కాలు పాటించండి?

కొంద‌రికి శ‌రీరం వేడిగా ఉంటుంది కొంద‌రికి శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది... వారి శ‌రీర సౌష్ట‌వం బ‌ట్టి వారి శ‌రీర ఉష్ణ స్దితులు ఉంటాయి.. అయితే కొంద‌రు అధికంగా వేడి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు.. కొన్ని ఆహార ప‌దార్దాలు తీసుకోవ‌డానికి కూడా అయిష్టత చూపుతారు.... వేడి ఎక్కువ ఉన్న‌వారిలో చెమ‌ట‌పొక్కులు సెగ గ‌డ్డ‌లు అధికంగా వ‌స్తాయి.....కొంద‌రికి అధిక వేడి వ‌ల‌న జ‌లుబు ఉంటుంది... కొంద‌రికి చెమ‌ట రూపంలో బ‌య‌ట‌కు వెళుతుంది ఈ వేడి.. అయితే ఈ వేడి బ‌య‌ట‌కు పోవ‌డానికి కొన్ని చిట్కాలు ఆరోగ్య‌ప‌ర‌మైన‌వి చెబుతున్నారు అవేంటో చూద్దాం?
 
1... శ‌రీరంలోని వేడిని తొల‌గించ‌డంలో గ‌స‌గ‌సాలు బాగా ప‌నిచేస్తాయి. వీటి పొడిని చాలా త‌క్కువ మోతాదులో తీసుకుని దాన్ని నీటిలో క‌లిపి తాగితే ఫ‌లితం ఉంటుంది.
 
2... అలాగే ఓ  గ్లాస్ చ‌ల్ల‌ని పాల‌లో ఒక టీస్పూన్ తేనె క‌లుపుకుని తాగితే శ‌రీరంలో ఉండే అధిక వేడి మొత్తం బ‌య‌ట‌కు పోతుంది. శ‌రీరం చ‌ల్ల‌గా మారుతుంది. 
 
3. మంచి గంధం అర‌గ‌దీసి దాన్ని నీటితో క‌లిపి పేస్ట్‌లా చేసి నుదుటిపై రాయాలి. దీంతో వేడి త‌గ్గుతుంది. 
 
4...ఒక గ్లాస్ పాల‌లో కొద్దిగా వెన్న క‌లుపుకుని తాగితే అధిక వేడి స‌మస్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 
 
5.. నిమ్మ‌ర‌సం, లేదా అలోవెరా (క‌ల‌బంద‌) జ్యూస్‌ను తాగినా అధిక వేడి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.
 
6... అధిక మోతాదులో నీటిని తాగినా శ‌రీరం త్వ‌ర‌గా వేడి నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతుంది.
 
7.. స‌బ్జాగింజ‌లు నీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌డం స‌గ్గుజావ తీసుకోవ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కూ శ‌రీరంలో అధిక వేడిని ఇది త‌గ్గిస్తుంది
 
8..చోడిపిండి జావ పెరుగుతో తీసుకుంటే శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది
 
9..ఒక గ్లాస్ దానిమ్మ ర‌సం తాగితే అధిక వేడి వెంట‌నే త‌గ్గుతుంది. అందులో అవ‌స‌రం అనుకుంటే కొద్దిగా బాదం నూనె క‌లుపుకుని తాగ‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంకా మంచి ఫ‌లితం ఉంటుంది. 
 
10..ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని అలాగే తినాలి. లేదంటే వాటిని పొడి చేసి నీటిలో క‌లుపుకుని కూడా తాగ‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా అధిక వేడి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 
 
12.. రోజూ అర‌లీట‌రు మ‌జ్జిగ, ఓ కొబ్బ‌రి బొండం తీసుకుంటే అధిక వేడి స‌మ‌స్య మ‌రింత త‌గ్గుతుంది వేస‌విలో రోజూ ఇలా చేస్తే అధిక వేడి నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.