త‌ల‌నొప్పిని త‌గ్గించే చిట్కాలు..

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

headache
Updated:  2018-09-12 05:55:19

త‌ల‌నొప్పిని త‌గ్గించే చిట్కాలు..

మ‌న‌లో చాలా మందికి త‌ర‌చూ త‌ల‌నొప్పి బాధిస్తూ ఉంటుంది... కొంద‌రికి మైగ్రేన్ గా  వేధిస్తూ ఉంటుంది.. ఒత్తిడి, ఆందోళన, డీ హైడ్రేషన్, రక్త సరఫరా మెదడుకు సరిగ్గా జరగకపోవడం ఇలాంటి అనేక కార‌ణాల వ‌ల్ల త‌ల‌నొప్పి వేధిస్తూ ఉంటుంది.. ఇక కొంద‌రు త‌ల‌కు నూనె రాసుకుంటే మ‌రి కొంద‌రు ఇంగ్లీష్ మందుల జోలికి వెళ‌తారు  అలా ఉప‌శ‌మనం పొందుతారు. అయితే ఇలా త‌ల‌నొప్పి త‌ర‌చూ వేధిస్తూ ఉంటే అనేక సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి... అందుకే ఇలా త‌ల‌నొప్పి రాకుండా కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం
 
మూడు టేబుల్ స్పూన్ల పెప్పర్‌మెంట్ ఆయిల్‌ను ఒక టేబుల్ స్పూన్ నీరు లేదా బాదం నూనెలో కలపాలి.  ఈ మిశ్రమాన్ని నుదుటితోపాటు మెడపై కూడా మర్దనా చేయాలి. ఇలా చేస్తే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. త‌ర‌చూ రాకుండా ఈ స‌మ‌స్య త‌గ్గుతుంది..పుదీనా ఆకులను బాగా నలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని నుదురు, మెడపై మర్దనా చేసినా ఫలితం ఉంటుంది. తలనొప్పి తగ్గుతుంది. 
 
ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకుని వాటిని బాగా కలపాలి. అప్పుడు వచ్చే మిశ్రమాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి వెంటనే తాగేయాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తనాళాల వాపులను తగ్గించి రక్త సరఫరా పెంచే గుణం అల్లంలో ఉంది. అందుకే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.కొబ్బ‌రి నూనెను త‌ల‌పై రాసి మ‌ర్ద‌నా చేసి త‌ల‌నొప్పి త‌గ్గిపోతుంది... మండుటెండ‌లో తిరిగి వ‌చ్చిన వారికి నెత్తిన నీరు పోసుకుంటే ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ చురుగ్గా సాగుతుంది.
 
ఇక వంటి ఇంటిలో ఉండే  దాల్చిన చెక్కను తీసుకుని పొడి చేయాలి. దాన్ని నీటితో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను నుదురు, కణతలు, మెడకు పూర్తిగా రాయాలి. త‌ర్వాత‌ 30 నిమిషాలు ఆగి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కూడా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.  అలాగే  కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని అందులో రెండు చుక్కల లవంగం నూనె, కొద్దిగా సముద్రపు ఉప్పు కలిపి మిశ్రమంగా చేయాలి. దీన్ని నుదుటిపై రాసి కొంత సేపు ఉంటే చాలు. తలనొప్పి తగ్గిపోతుంది. ల‌వంగాల‌ను పొడి చేసి పొడి గుడ్డ‌లో వేసి ఆ వాస‌న పీల్చినా త‌ల‌నొప్పి స‌మ‌స్య త‌గ్గిపోతుంది. తుల‌సి ఆకుల‌ను న‌మిలినా వాటిని వేడినేటిలో మ‌ర‌గ‌పెట్టి తేనెతో క‌లిపి సేవించినా ఈ స‌మ‌స్య త‌గ్గుతుంది.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.