ఇలా ప‌డుకుంటే గుర‌క రాదు సుఖ నిద్ర మీ సొంతం..

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

snoring
Updated:  2018-09-29 05:52:01

ఇలా ప‌డుకుంటే గుర‌క రాదు సుఖ నిద్ర మీ సొంతం..

ప్ర‌స్తుత న‌వీన యుగంలో మ‌నిషి 80 సంవ‌త్స‌రాలు బ్ర‌తుకుతాడు అంటున్నారు వైద్యులు.. స‌రైన ఆరోగ్య జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఎటువంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు అంటున్నారు... అయితే మ‌నిషి ఎంత పని చేసి వ‌చ్చినా త‌గిన ఆహారం తిని నిద్ర‌పోతాడు.. ఆ నిద్రే మ‌నిషి ఆరోగ్యాన్ని స‌గం స‌మ‌స్య‌లు లేకుండా చేస్తుంది.. సుఖ నిద్ర ఉంటే ప‌లు స‌మ‌స్య‌లు మ‌న ద‌రిచేర‌వు. కొన్నిసార్లు ప‌డుకున్నా వెంట‌నే నిద్ర వ‌స్తుంది.. మ‌రి కొన్ని సార్లు నిద్ర దూరం అవుతుంది.. అయితే ప‌డుకునే స‌మ‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఇటువంటి స‌మ‌స్య‌లు రావు అంటున్నారు వైద్యులు.
 
చాలా మంది రాత్రి తిన్న‌త‌ర్వాత వెంట‌నే ప‌డుకుంటారు.. ఇది మంచిది కాదు, ఆహారం తిన్నా రెండుగంట‌ల‌కు నిద్ర‌పోవ‌డం మంచిది.. వెంటనే నిద్ర‌పోకూడ‌దు అలాగే చాలా మంది బోర్లా ప‌డుకుంటారు.... ఇది మంచి ప‌ద్ద‌తి అనుకుంటారు ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చెబుతున్నారు, ఇలా ప‌డుకుంటే మెద‌డు పై ప్ర‌భావం ప‌డుతుంది....ఓవైపు తిరిగి ప‌డుకోవ‌డం మెడ మ‌రింత కింద‌కు వంచ‌కుండా ప‌డుకోవ‌డం సుఖ‌నిద్ర‌కు  మంచిది.. దీని వ‌ల‌న మెడ‌నొప్పులు రాకుండా ఉంటాయి. రెండు చేతులు స‌మానంగా ఉంచి పడుకుంటే సుఖ‌నిద్ర ప‌డుతుంది.
 
అలాగే కడుపుతో ఉన్నగ‌ర్భిణీలు ఎడమవైపు తిరిగి పడుకోవడం ఆరోగ్యకరమని చెబుతున్నారు నిపుణులు. ఇలా పడుకోవడం వల్ల కడుపులోన శిశువుకు మరింత రక్తం, పోషకాలు అందుతాయంటున్నారు... పొట్ట భాగం పైకి ఉంచేలా, వీపు భాగం భూమిని ఆనేలా పడుకొనే ఈ పద్ధతిలో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. గురక పెట్టే అలవాటున్న వారిలో ఇది మరింత ఎక్కువే ఉంటుంది. వెన్నుభాగాన్ని ఆధారంగా చేసుకొని పడుకోవడం ద్వారా, శ్వాససంబంధిత ఇబ్బందులు మరింత పెరుగొచ్చు. 
 
పెళ్లి అయిన త‌ర్వాత భాగ‌స్వామితో క‌లిసి ఒకరినొకరు హత్తుకొని పడుకుంటారు. అది శరీరం ఆక్సిటోసిన్‌ను రిలీజ్ చేసేందుకు ఉపకరిస్తుంది. ఒత్తిడి తగ్గి, బంధాలు, అనుబంధాలు బలపడేందుకు దోహదం చేస్తుంది...గురకపెట్టే అలవాటు ఉన్నవారు ఒకవైపు తిరిగి పడుకోవడం ఉత్తమం. ఇలా ప‌డుకోవ‌డం వ‌ల్ల వెన్ను స‌మ‌స్య‌లు త‌ల‌నొప్పి కండ‌రాల బ‌ల‌హీన‌త చేతుల నొప్ప‌లు మీ ద‌రిచేర‌వు... అందుకే ప‌డుకోవ‌డంలో ఇటువంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటే, సుఖ నిద్ర‌తో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.