బేబీ కార్న్‌తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

baby corn
Updated:  2018-10-29 04:55:50

బేబీ కార్న్‌తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలో తెలుసా?

బేబికార్న్ ఇప్పుడు సంప్ర‌దాయ వంట‌కాల‌తో పాటు వెరైటీ డిష్ ల‌లో ఘుమ‌ఘుమ‌లు గుప్పిస్తోంది..బేబి కార్న్ తో అనేక ర‌కాల వంకాల‌ను చేసుకుంటారు..బేబీ కార్న్ కేవలం రుచిలో మాత్రమే కాదు, మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను అందించడంలోనూ బాగా పనిచేస్తుంది... ఇలాంటి బేబి కార్న్ ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్య స‌మ‌స్యలు ఏమీ రావు, అలాగే ఆరోగ్యానికి స‌రైన పోష‌కాల‌ను మాత్రం అందిస్తుంది అని అంటున్నారు వైద్యులు...
 
1. బేబీ కార్న్‌లో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. 100 గ్రాముల బేబీ కార్న్ తింటే కేవలం 26 క్యాలరీలు మాత్రమే వస్తాయి. అందువల్ల ఇది బరువు తగ్గాలనుకునే వారికి మేలైన ఆహారంగా పనిచేస్తుంది. 
 
2. బేబీ కార్న్‌లో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. అందువల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. 
 
3. బేబీ కార్న్‌లో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీంతోపాటు విటమిన్ ఎ, ఐరన్, విటమిన్ సిలు కూడా వీటిల్లో ఉంటాయి. కనుక ఇవి మనకు చక్కని పోషణను అందిస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుంది. 
 
4 ఫోలేట్ అనే పోషక పదార్థం బేబీ కార్న్‌లో పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణీలకు మేలు చేస్తుంది. శిశువు ఎదుగుదలకు సహాయపడుతుంది. అందువల్ల గర్భిణీలు బేబీ కార్న్ తినడం చాలా మంచిది.
 
5.. బేబీ కార్న్‌లో కెరోటినాయిడ్స్ అనబడే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి దృష్టి సంబంధ సమస్యలను దూరం చేస్తాయి. చూపు బాగా పెరుగుతుంది. నేత్ర సమస్యలు ఉన్నవారు బేబీ కార్న్‌ను తరచూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు కంటి శుక్లాలు రాకుండా ఉంటాయి. 
 
6.. ఉడికిన‌వాటిని తిన‌డం శ్రేయ‌స్క‌రం... ఇక వెజిటేబుల్ కూర‌లా చేసుకుని ఇవి తిన‌డం వ‌ల్ల ఎటువంటి పోష‌కాలు పోవు అని చెబుతున్నారు నిపుణులు.. ఇందులో మ‌సాలా కారం క‌లుపుకుని తిన‌డం అనే అల‌వాటును త‌గ్గించుకోవాలి అని సూచిస్తున్నారు. అందుకే వారానికి  ఓసారి బేబి కార్న్ మీ ఫుడ్ మెనులో ఉండేలా చూసుకోండి.

 

షేర్ :

Comments

0 Comment