కొబ్బ‌రి నీళ్లు తాగితే మీకు ఆ విష‌యాల్లో తిరుగే ఉండ‌దు ?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

coconut water
Updated:  2018-07-13 05:54:57

కొబ్బ‌రి నీళ్లు తాగితే మీకు ఆ విష‌యాల్లో తిరుగే ఉండ‌దు ?

కొబ్బరి బోండాం కోన‌సీమ‌కు బ్రాండ్ గా కొబ్బరిని చెబుతారు.. అలాగే కేర‌ళ కొబ్బ‌రి కూడా ప్ర‌సిద్ది.. కొబ్బ‌రి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. దేవాల‌యాల్లో కొబ్బ‌రికాయ కొట్ట‌నిదే పూజాదికారాలు చేయ‌రు. అస‌లు కొబ్బ‌రికి మ‌న దేశంలో ఎంతో  పేరు ఉంది.. కొబ్బ‌రి వాడ‌ని ఇళ్లు ఉండ‌దు, కొబ్బ‌రి ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది.. ప‌లు ఔష‌దాలకు కూడా కొబ్బ‌రిని వాడ‌తారు.
 
ఎండ‌ల్లో కొబ్బ‌రి నీరు తాగితే దాహార్తిని తీర్చి మ‌న‌కు రీ ఫ్రెష్ మెంట్ క‌లిగిస్తుంది.క‌లుషితం లేని ఆరోగ్య‌క‌ర‌మైన నీరు అందిస్తుంది... ఈ నీటిని సర్వరోగ నివారిణిగా భావిస్తారు. కొబ్బరి బొండాం నీటిని వారం క్రమం తప్పకుండా పరగడుపున తీసుకుంటే.. అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. ఆ విష‌యాలు ఇప్ప‌డు తెలుసుకుందాం.
 
పరగడుపున కొబ్బరి బొండాం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
 
శరీరంలో బ్యాక్టీరియాను బయటకు పంపి, యూరినరీ ఇన్ఫెక్షన్లు రాకుండా కొబ్బరి బొండాం తోడ్పడుతుంది. 
 
శీతాకాలంలో కూడా కొబ్బరి బోండాం తాగడం వల్ల.. జలుబు రాకుండా ఉంటుంది. 
 
కొబ్బరిబొండాన్ని వారం పాటు పరగడుపున తీసుకుంటే ఇంతకు ముందు లేని ఉత్సాహం వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్‌ తొలగడమే కాక కిడ్నీల్లో రాళ్లు కూడా క్రమేపి తగ్గుతాయి. 
 
కొబ్బరి బోండాం నిత్యం తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. 
 
శరీరానికి కావలసిన ఫైబర్‌ను కొబ్బరిబొండాంలోని నీళ్లు అందిస్తాయి.
 
వారం పరగడుపున రోజులు క్రమం తప్పకుండా కొబ్బరి బోండాం తాగితే కొవ్వు శాతం క్రమంగా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.. 
 
కొబ్బరినీళ్లు తాగితే.. డీహైడ్రేషన్‌ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవచ్చు. 
 
చర్మం నిర్జీవంగా మారి ఇబ్బంది పెడుతున్నప్పుడు కొబ్బరినీళ్లు వారం రోజులపాటు తాగితే చర్మకాంతి మెరుగుపడుతుంది. 
 
తల్లి పాలలో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ కొబ్బరి బోండాం నీళ్లలో కూడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ఈ నీళ్లను పిల్లలు తాగితే మానసిక, శారీరక ఎదుగుదలకు చక్కగా పని చేస్తుంది. 
 
గర్భిణీలు నిత్యం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గర్బాశయంలో ఉన్న సమస్యలు తగ్గి, బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. 
 
కొబ్బరినీళ్లు కంటిచూపు మెరుగుపరచడానికీ తోడ్పడతాయి. 
కొబ్బరినీళ్లు తాగడం వల్ల చర్మంపై ముడతలు రావడం తగ్గి, వయసు తక్కువగా కనపడుతుందంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.