ఖ‌ర్జూరం తిన‌డం వ‌ల్ల ఎన్నిలాభాలంటే..

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

dates
Updated:  2018-10-01 12:47:45

ఖ‌ర్జూరం తిన‌డం వ‌ల్ల ఎన్నిలాభాలంటే..

ఈ ఖ‌ర్చూరం అంటే మ‌న‌కు సంప్ర‌దాయ ఫ‌లంగా కూడా చెబుతారు ... ముఖ్యంగా రంజాన్ వ‌చ్చింది అంటే ఈ పండును  ఎక్కువ‌గా వాడ‌తారు.. శ‌రీరానికి ఎంతో ఫుష్టి చేస్తుంది అని చెబుతారు... ఇక ఈ డేట్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది...  మ‌రీ ముఖ్యంగా పిల్ల‌ల‌కు ప్రాణం అనే చెప్పాలి... అయితే ప్ర‌ముఖ కంపెనీల డేట్స్ కోసం త‌ర‌చూ మారాం చేస్తారు పిల్లలు...అయితే ఈ డేట్స్ తినాలి అని పిల్ల‌ల‌కే కాదు పెద్ద‌ల‌కు కూడా అనిపిస్తుంది. అయితే డేట్స్ ఆరోగ్యానికి చాలా  మంచిది అని మంచి ఫుడ్ అని సలహా ఇస్తారు డాక్ట‌ర్లు... నిజ‌మే అందుకే డేట్స్ వెంట ప‌డ‌తారు చాలా మంది..
 
అయితే ఇలా డేట్స్ తీసుకుంటే శ‌రీరానికి ఎటువంటి ఉప‌యోగం ఉంది దీనివ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం?
 
ముఖ్యంగా ముస్లింలు ఉప‌వాస దీక్ష‌లో ఈ ఖ‌ర్జూర‌పు పండ్ల‌ను తీసుకుంటారు.ఇస్లామిక్‌ దేశాల్లో ఖర్జూర వృక్షాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు...ఈ డేట్స్ తింటే మ‌న శ‌రీరానికి ఎన్నో పోష‌కాలు అందుతాయి అలాగే అనారోగ్యానికి దూరంగా ఉండ‌వ‌చ్చు.ఖర్జూరం పండ్లలో జియాక్సిథిన్, టూటిన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది బెస్ట్ ఐ విటమిన్‌గా పనిచేస్తుంది. క్యాల్షియం కంటెంట్ అధికంగా ఉండటం వల్ల డయేరియాను నివారిస్తుంది. 
 
ఇక మలబద్దకం సమస్యకు ఈ పండ్లను తిన‌డం వల్ల చెక్ పెట్టొచ్చు.... ప్రసవానికి ఒక నెల ముందు నుంచి డేట్స్ తీసుకోవడం వల్ల ప్రసవ నొప్పులు, బ్లీడింగ్ సమస్యలను నివారిస్తుంది... ముఖ్యంగా బాలింతలు వీటిని ఆరగిస్తే పాలు ఎక్కువగా పడతాయి అంటారు...పరగడుపు డేట్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి.  ముఖ్యంగా హృద్రోగంతో బాధపడేవారు రోజుకు మూడు డేట్స్ చొప్పున తింటే చాలు మంచి ఫలితం ఉంటుంది.వీరి ఆరోగ్యానికి ఎటువంటి డోకా ఉండ‌దు. ఒక గ్లాసు నీళ్లలో మూడు డేట్స్‌ ను నానబెట్టి, ఆ నీటిని ఉదయం పరగడుపున తాగాలి అలాగే ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు మూడు సార్లు తింటే చాలు గుండెపోటు బారినపడకుండా ఉండవచ్చట‌.. డేట్స్ పిల్ల‌లు ఎంత  తీసుకున్నా మంచిదేనా అని అడుగుతారు కొంద‌రు.. ఇవి  అతిగా తిన‌డం కంటే రోజుకు పిల్ల‌లు పెద్ద‌లు ఆరు నుంచి ఏడు డేట్స్ తీసుకోవ‌డం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు వైద్యులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.