సొంపు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

fennel seed
Updated:  2018-10-01 12:15:11

సొంపు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

ఇక ప్ర‌స్తుతం చాలా మంది జంక్ ఫుడ్ తిన‌డానికి అల‌వాటు ప‌డుతున్నారు.. గ‌తంలో ఇంటి భోజ‌నానికి ఎక్కువ ఆస‌క్తి చూపిస్తే ఇప్పుడు బ‌య‌ట భోజ‌నం జంక్ ఫుడ్ ల‌కు క్యూ క‌డుతున్నారు చాలా మంది... అయితే భోజ‌నం చేశాక గ‌తంలో చాలా మంది సొంపు తినేవారు ఇది మంచి అల‌వాటే అని చెప్పాలి... దీని వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అని ఇప్ప‌టికీ పెద్ద‌లు చెబుతున్నారు.. ఇది ఆయురారోగ్యాలు కలిగించే ఔష‌దాలు క‌లిగింది అని చెబుతారు.
 
అయితే మారుతున్న స‌మాజం ప‌ద్ద‌తుల‌తో పాటు ఆహార నియ‌మాలు ప‌ద్ద‌తులూ కూడా మారాయి అందులో సొంపు తినే అల‌వాటును చాలా మంది మ‌ర్చిపోయారు.. అయితే భోజనం చేసిన త‌ర్వాత సొంపు తింటే ఎటువంటి లాభాలు క‌లుగుతాయో అనేది  ఇప్పుడు తెలుసుకుందాం?
 
భోజ‌నం చేసిన వెంట‌నే సోంపును తింటే దాంతో నోరు తాజాగా మారుతుంది. నోటిలో ఉండే బాక్టీరియా, ఇత‌ర క్రిములు న‌శించ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ క్ర‌మంలో దంతాలు, చిగుళ్లు శుభ్రంగా మారుతాయి. వాటిలో ఉన్న స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయి.... అలాగే భోజ‌నం చేశాక సోంపు తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం ఉండ‌వు. ఇక మ‌ల‌బ‌ద్ద‌కం అనే స‌మ‌స్య కూడా దూరం అవుతుంది.
 
ఇక ఎంతో మంది బాధ‌ప‌డే స‌మ‌స్య అధిక బ‌రువుదీనికి  సోంపు ఓ చ‌క్క‌ని ప‌రిష్కారం అని చెప్ప‌వ‌చ్చు..దీనికి కార‌ణం సొంపు తిన్నాక ఒంట్లో ఉన్న నీటి శాతం త‌గ్గుతుంది అలా నీరు బ‌య‌ట‌కు పోవ‌డం వ‌ల్ల కూడా బ‌రువు త‌గ్గుతారు. అలాగే సోంపులో మాంగ‌నీస్, జింక్‌, కాప‌ర్‌, ఐర‌న్‌, కాల్షియం, పొటాషియం, సెలీనియం, మెగ్నిష‌యం వంటి ఖ‌నిజ ల‌వణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. దీంతో ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. శ‌రీరంలో జ‌రిగే ఫ్రీ ర్యాడిక‌ల్స్ న‌ష్టాన్ని నివారించ‌వ‌చ్చు.. ఇక పేగు సంబంధ వ్యాధులు ఉన్నా అవి త‌గ్గుతాయి.
 
ఇక సొంపు తిని ప‌ళ్ల‌ను పుక్క‌లించుకోవాలి దీని వ‌ల్ల ప‌ళ్ల‌కు కూడా చాలా మంచిది. అలాగే ఐర‌న్‌, కాపర్ వంటి పోష‌కాలు ఉండ‌డం వ‌ల్ల సోంపు గింజ‌ల‌తో ర‌క్తం బాగా ప‌డుతుంది. ఇది ర‌క్త‌హీన‌త ఉన్న వారికి మేలు చేస్తుంది. ఎర్ర ర‌క్త క‌ణాల‌ను ఎక్కువ‌గా త‌యారు చేసేలా చూస్తుంది. గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఇది ఎంత‌గానో మేలు చేసే అంశం. అందుకే సొంపును త‌ర‌చూ తీసుకోవ‌డం చాలా మంచిది అని డాక్ట‌ర్లు కూడా చెబుతూ ఉంటారు...సోంపు గింజ‌లు బీపీని నియంత్రిస్తాయి. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి. . ఇక సొంపు తిన‌డం వ‌ల్ల కొవ్వు స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. శ‌రీరంలో వేడి కూడా త‌గ్గుతుంది ద‌గ్గు క‌డుపులో మంట సొంపుతో పోతుంది అని చెబుతారు వైద్యులు. అందుకే సొంపును త‌ర‌చూ భోజ‌నం చేసిన త‌ర్వాత తీసుకోవ‌డం మ‌ర్చిపోకండి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.