గ్రీన్ ఆపిల్ తినండి ఆరోగ్యంగా ఈ ప్ర‌యోజ‌నాలు పొందండి..?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

green apple
Updated:  2018-09-29 04:03:43

గ్రీన్ ఆపిల్ తినండి ఆరోగ్యంగా ఈ ప్ర‌యోజ‌నాలు పొందండి..?

యాపిల్స్ ఎన్నో ర‌కాలు ఉంటాయి... రెడ్ క‌ల‌ర్ యాపిల్ ఎక్కువ‌గా తింటూ ఉంటారు... అయితే రోజూ ఓ ఆపిల్ తింటే ఎటువంటి ఆరోగ్య స‌మస్య‌లు ఉండ‌వు... అలాగే డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌వ‌ల‌సిన అవ‌సరం లేదు అంటారు.. అయితే రెడ్ యాపిల్ కాదు ఇప్పుడు గ్రీన్ ఆపిల్ కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి... కాస్త ధ‌ర ఎక్కువ అయినా ఇవి కూడా అప్పుడు అప్ప‌డు తింటూ ఉండండి... ఇవి శ‌రీరానికి మ‌రింత మేలు చేస్తాయి. ఇందులో కూడా ఎన్నో రకాల పోష‌కాలు ఉన్నాయి.. స‌రైన పోష‌కాలు అందిచండంలో యాపిల్ పండ్లు అన్ని ఒకే విధ‌మైన మేలు చేస్తాయి. గ్రీన్ యాపిల్ తింటే ఎటువంటి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
 
గ్రీన్ యాపిల్ పండ్ల‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ప్రోటీన్లు, విట‌మిన్లు, ఖ‌నిజాలు, ఫైబ‌ర్ వంటి ముఖ్యమైన పోష‌కాలు ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి సంపూర్ణ పోష‌ణ‌ను అందిస్తాయి. రెడ్ యాపిల్ తో స‌మానంగా ఇందులో ఫైబ‌ర్ ఉంటుంది. ఇవి తిన‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్ధ మెరుగు ప‌డుతుంది.. పేగు స‌మ‌స్య‌లు రావు అలాగే తొక్క‌తో యాపిల్ తిన‌డం ఆరోగ్యానికి మ‌రింత మంచిది.గ్యాస్ అసిడిటి రాదు అలాగే ఆక‌లి బాగా వేస్తుంది మ‌ల‌బ‌ద్ద‌కాన్ని పొగొడుతుంది అని చెబుతున్నారు వైద్యులు.
 
అలాగే  ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. హైబీపీ త‌గ్గుతుంది. ర‌క్తం పెరుగుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ప్ర‌స్తుత కాలంలో అంద‌రూ మ‌ధుమేహంతో బాధ‌ప‌డుతూ ఉన్నారు ఇటువంటి స‌మ‌స్య ఉన్న‌వారికి   గ్రీన్ యాపిల్స్ చాలా మేలు చేస్తాయి. వారి ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. దీని వ‌ల్ల మ‌ధుమేహం అదుపులో ఉంటుంది. 
 
శ‌రీరంలో అధికంగా ఉండే కొవ్వు క‌రిగి అధిక బరువు త‌గ్గుతారు. ర‌క్త‌నాళాల్లో పేరుకుపోయే కొవ్వును గ్రీన్ యాపిల్స్ క‌రిగిస్తాయి. దీంతో గుండె పోటు రాకుండా ఉంటుంది.  అలాగే వీటిలో  విట‌మిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉండ‌డం వ‌ల్ల చ‌ర్మ క్యాన్స‌ర్ రాకుండా ఉంటుంది. కాలేయ ప‌నితీరు మెరుగుప‌డుతుంది. థైరాయిడ్ గ్రంథి స‌క్ర‌మంగా ప‌నిచేస్తుంది. దంతాలు, ఎముక‌లు దృఢంగా మారుతాయి. కీళ్ల వ్యాధులు ఉండ‌వు. రోజూ ఒక గ్రీన్ యాపిల్ తింటే ఆస్త‌మా రాకుండా ఉంటుంది. ఇక మొటిమ‌లు త‌గ్గుతాయి, న‌ల్ల కింద వ‌ల‌యాలు త‌గ్గుతాయి.. అందుకే రెడ్ యాపిల్ తో పాటు గ్రీన్ ఆపిల్ ను తీసుకుంటే మంచిది

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.