తేనెతో ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం చేసుకోండి?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

honey
Updated:  2018-10-01 12:22:13

తేనెతో ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం చేసుకోండి?

తేనె స‌హ‌జ‌సిద్ద ఔష‌ద గుణాలు ఉన్న ఓ పదార్ధం.. ఇది శ‌రీరానికి ఎంతో శ‌క్తిని ఇస్తుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. తేనెలో ప‌లు పోష‌కాలు మెండుగా ఉంటాయి... తేనెను పూజాకార్యాల‌లో కూడా వాడ‌తారు,తేనెతో అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు... ఇక త‌ర‌చూ ఆహారంలో తీసుకోవ‌డం, నిమ్మ‌తేనె క‌లిపి తీసుకోవ‌డం చేస్తూ ఉంటారు.. ఇటు జ్యూస్ ల‌లో బేక‌రీల‌లో ప‌లు ఆహార‌ప‌దార్దాల తయారీలో తేనెని వాడ‌తారు... తేనెతో కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం చేయ‌వ‌చ్చు అంటున్నారు వైద్యులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 
చ‌ర్మంపై గాయాలు, పుండ్లు, చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఆయా భాగాల్లో కొంత తేనె రాస్తూ ఉంటే వెంట‌నే వాటి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. గాయాలు, పుండ్ల‌ను త్వ‌ర‌గా న‌యం చేసే స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు తేనెలో ఉన్నాయి...ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం, రెండు టీస్పూన్ల తేనె క‌లిపి తాగితే గొంతు నొప్పి త‌గ్గుతుంది. 
 
తేనె, దాల్చిన చెక్క పొడిని బ్రెడ్‌ మీద చ‌ల్లుకుని తింటే కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. వేడినీటిలో ఒక స్పూన్ తేనె, దాల్చిన చెక్క పొడి వేసి ఆ నీటితో కొద్దిసేపు పుక్కిలించి ఉమ్మేస్తే నోటి దుర్వాసన పోతుంది..అలాగే వేడినీటిలో ఒక స్పూన్ తేనె, దాల్చిన చెక్క పొడి వేసి ఆ నీటితో కొద్దిసేపు పుక్కిలించి ఉమ్మేస్తే నోటి దుర్వాసన పోతుంది.
 
అధిక బ‌రువుతో బాధ‌ప‌డేవారు రోజూ 1/4 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో రెండు టీస్పూన్ల తేనె కలుపుకుని తాగితే అధిక బ‌రువు  స‌మ‌స్య త‌గ్గుతుంది.  నిమ్మ‌ర‌సంలో తేనె క‌లుపుకుని తాగితే క‌డుపు ఉబ్బ‌రం, ఆయాసం త‌గ్గుతాయి. అలాగే 
తేనెలో మిరియాల పొడి క‌లుపుకుని తీసుకుంటే జ‌లుబు త‌గ్గుతుంది.... ఇక గొంతు నొప్పి స‌మ‌స్య ఉంటే నిమ్మ‌ర‌సం తెనె క‌లిపి వేడినీటితో తీసుకుంటే గొంతి నొప్పి త‌గ్గుతుంది.. అలాగే  పుదీనా తెనె కూడా శ‌రీరంలో చెడు మ‌లినాల‌ను బ‌య‌ట‌కు పంపేలా చేస్తుంది..ఇక లెమెన్ టీ తేనె ఎక్కువ‌గా తీసుకుంటే శ‌రీరానికి  నూత‌న ఉత్తేజం కాంతి వ‌స్తుంది..చ‌ర్మానికి కూడా ఎంతో మంచిది..రాత్రి పూట తెనె ఓ గ్లాసు పాల‌లో తీసుకుంటే చ‌క్క‌ని నిద్ర‌ప‌డుతుంది. అందుకే తేనె త‌ర‌చూ వాడితే ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి దూరం అవుతారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.