కీర‌దోస వ‌ల్ల ఉప‌యోగాలు తెలుసుకోండి..?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

keera dosa
Updated:  2018-10-30 04:35:35

కీర‌దోస వ‌ల్ల ఉప‌యోగాలు తెలుసుకోండి..?

దోస పండ్ల‌లో కీర‌దోస ఎంతో మేలు చేస్తుంది.. ఇది వేస‌వి వేడిని మ‌న శ‌రీరంలో త‌గ్గించ‌డంలో ఎంతో తోడ్ప‌డుతుంది.. కీరోదోస ఎంత తిన్నా అది జీర్ణం అవుతుంది. జీర్ణ‌వ్య‌వ‌స్ద మెరుగుప‌డుతుంది. కీర‌దోస‌లో పుష్క‌లంగా పోష‌కాలు ఉన్నాయి....కీరదోస రీహైడ్రేటింగ్ ఏజంట్‌గా పని చేస్తుంది... కీర‌దోస మ‌న శ‌రీరానికి ఎంతో చ‌లువ చేస్తుంది. ఇందులో పోటాషియం మెగ్నిషియం అధికంగా ఉంటాయి.. ఇది ర‌క్త‌పోటును త‌గ్గిస్తుంది ఇలాంటి  కీర‌దోస వ‌ల్ల మ‌న‌కు ఎటువంటి ఉప‌యోగాలో తెలుసుకుందాం.
 
కీర దోసలో 95 శాతం నీళ్లే ఉంటాయి. దీంతో డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది... మ‌న‌ శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగిస్తుంది. అలాగే సాధ్యమైనంత వరకు పొట్టు తీయకుండా శుభ్రంగా కడిగి తినడం మంచిది. కీరదోస పొట్టు లో సీ విటమిన్ ఉంటుంది. ఒక రోజులో శరీరానికి అవసరమయ్యే సీ విటమిన్ పది శాతం వరకు అందుతుంది.
 
ముఖ్యంగా  కీరదోసలోని లవణాలు గోళ్లు చిట్లకుండా అందంగా ఉంచుతాయి...కళ్లకింద నల్లటి చారలు ఏర్పడితే. . కీర దోస ముక్కలను పెట్టుకుంటే అవి తొలగిపోతాయి. క‌ళ్ల‌కింది ఉబ్బినా వాపులు వ‌చ్చినా ఆ వాపులపై కీర‌పెడితే అవి త‌గ్గుతాయి.... ముఖ్యంగా శిరోజాల ఎదుగుదలకు దోసలోని సల్ఫర్, సిలికాన్ ఉపయోగపడుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. .. రోజుకు ఒక కీర‌దోస తీసుకుంటే కడుపులోని మంట (ఎసిడిటి)ని తగ్గిస్తుంది. 
 
కీర‌దోస తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు అలాగే ఇందులో పీచు ప‌దార్దం ఉండ‌టం వ‌ల్ల ఇది జీర్ణం సుల‌భ‌త‌రం అవుతుంది మ‌ల‌బ‌ద్ద‌కాన్ని తొల‌గిస్తుంది. కీర‌దోస ర‌సంగా గాని లేదా జ్యూస్ గా గానీ తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. ముఖ్యంగా వేస‌విలో కీర‌దోస త‌ర‌చూ తీసుకుంటే శ‌రీరంలోవేడిని  స‌క్ర‌మంగా ఉంచుతుంది అధిక వేడి స‌మస్య‌ను త‌గ్గిస్తుంది.

షేర్ :

Comments

0 Comment