రోజూ నిమ్మ‌ర‌సం తాగితే ఈ లాభాలు మీ సొంతం?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

lemon
Updated:  2018-08-28 04:27:28

రోజూ నిమ్మ‌ర‌సం తాగితే ఈ లాభాలు మీ సొంతం?

నిమ్మకాయ శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది... శ‌రీరం లోప‌ల అంత‌ర్గ‌త భాగాల‌కే కాదు శ‌రీరం పై చ‌ర్మం పై ఎంతో ప్ర‌భావం చూపుతుంది .. నిమ్మ‌ను ఆరోగ్యధాత‌గా చెప్ప‌వ‌చ్చు.. నిమ్మ చేసే మేలు ఎంతో డాక్ట‌ర్లు నిరంతరం చెబుతారు చూడ‌టానికి చిన్న‌ది అయినా నిమ్మ ఎంతో మేలు చేస్తుంది శ‌రీరానికి.
 
విటమిన్ సితోపాటు శరీరానికి అవసరమయ్యే కీలక పోషకాలు కూడా నిమ్మర‌సం వల్ల మనకు లభిస్తాయి. నిమ్మ‌ర‌సాన్ని మ‌నం ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తాం. కొందరు సౌందర్య సాధనంగా కూడా నిమ్మరసాన్ని వాడుతారు. అయితే నిత్యం ఒక నిమ్మకాయ నుంచి పూర్తిగా రసాన్ని తీసి దాన్ని ఉదయాన్నే ప‌ర‌గ‌డుపునే తాగితే దాంతో మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
ఓ స్పూన్ తేనె ఓ రెండు స్పూన్ల నిమ్మ‌రసం తీసుకుని గ్లాసు నీటిలో క‌లిపి తీసుకుంటే శ‌రీరానికి ఎంతో మేలు ముఖ్యంగా శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అలాగే  అధిక‌కొవ్వు బ‌య‌ట‌కు వ‌స్తుంది.ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో యాసిడ్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. చ‌ర్మం మృదువుగా కాంతి వంతంగా కూడా మారుతుంది.
 
నిమ్మ రసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇందువల్ల ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతోపాటు పలు బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్ల నుంచి మనకు రక్షణను ఇస్తుంది. ప్రధానంగా జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం వంటివి తగ్గిపోతాయి.