ధ్యానం ఎందుకు చేయాలి దాని ప్ర‌యోజ‌నాలు..?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

meditation
Updated:  2018-10-05 06:18:30

ధ్యానం ఎందుకు చేయాలి దాని ప్ర‌యోజ‌నాలు..?

ధ్యానం చేయ‌డం ఆరోగ్యానికి ఎంతో మంచిది మ‌న‌కు మ‌రింత జ్ఞానాన్ని ఇస్తుంది.. అలాగే మ‌న‌సుకు ప్ర‌శాంత‌త వ‌స్తుంది... అందుకే చాలా మంది ఈ ప‌రుగుల ప్ర‌పంచంలో కాస్త రిలాక్స్ అవ‌డానికి ఒత్తిడి దూరం చేసుకోవ‌డానికి ధ్యానం చేస్తూ ఉంటారు...రోజూ ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానంతో కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..?
 
రోజూ ధ్యానం చేయడం వల్ల ఆలోచనా స్థాయి, అవగాహన శక్తి పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో మరింత సమర్ధంగా పనిచేస్తారు....ధ్యానం తాలూకు ఫలితాలు మీ ఆలోచనల్లో కనిపిస్తాయి. మీ మనస్సు గడిచిన కాలంపైకి, భవిష్యత్తుపైకి వెళ్లకుండా ప్రస్తుత కాలంపై దృష్టి నిలుపుతుంది. దానివల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మీలోని అనవసరమైన ఒత్తిడి తగ్గుతుంది. ఎక్కువ ఒత్తిడి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది అందుకే ఒత్తిడి లేకుండా ఉండాలి.
 
ఒత్తిడి ఎదుర్కోవాలి అంటే  ధ్యానం తప్పనిసరి. శ్వాసను ధీర్ఘంగా తీసుకోవడం, వదలడం చేస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది... అలాగే భావోద్వేగాలపై నియంత్రణ వస్తుంది. సంతోషాన్ని అందరూ వ్యక్తపరుస్తారు. కోపం, బాధ, విషాదం వంటి భావోద్వేగాలను వ్యక్తపరిచే సమయంలోనూ నియంత్రణ ఉండాలంటే ధ్యానంతోనే సాధ్యమవుతుంది. మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వస్తుంది. నిర్ణయం తీసుకునే ముందు దాని ఫలితాలు ఎలా ఉంటాయో ఆలోచించే శక్తి, విశ్లేషించుకునే సామర్థ్యం పెరుగుతాయి.
 
ధ్యానం ద్వారా కొత్త స్కిల్స్‌ నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది....ఇతర నైపుణ్యాల మాదిరిగానే ధ్యానం ఒక నైపుణ్యమే. ప్రాక్టీస్‌, ఏకాగ్రతతో ఇది పెరుగుతుంది.... అలాగే  జీవితంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ధ్యానం అనేది ప్ర‌శాంత‌గా ఎక్క‌డైనా చేసుకోవ‌చ్చు....గుడి, చర్చ్‌ వంటి ప్రార్థనా మందిరాల్లోనూ ఎక్క‌డైనా చేయవచ్చు. పార్క్‌ వంటి ఆరుబయట ప్రదేశాల్లో చేసినా ఉత్తమంగా ఉంటుంది.. ధ్యానం చేయ‌డం మంచిది అని  సైన్స్‌ కూడా చెబుతోంది. శరీరంలో రోగనిరోధక శక్తి బలోపేతమయి ఆరోగ్యవంతమైన జీవితం గడిపే అవకాశం లభిస్తుంది. అందుకే రోజుకు 15 నిమిషాల నుంచి ఇర‌వై నిమిషాల వ‌ర‌కూ ధ్యానం చేయండి ఆరోగ్యం ప్ర‌శాంత‌త పొందండి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.