పవర్ యోగా చేయడం వల్ల కలిగే ఉపయోగాలు...

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

power yoga
Updated:  2018-06-14 12:31:03

పవర్ యోగా చేయడం వల్ల కలిగే ఉపయోగాలు...

యోగా చేయడానికి ప్రపంచ దేశాలలో ఉన్న సాధారణ మానవుల నుండి ప్రముఖుల వరకు అందరు ఇష్టపడతారు... ఎందుకంటే యోగ మానసిక ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది...యోగ చేయడం వల్ల శరీరం, ఆత్మ, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది...మనిషి ఏ ఒత్తిడి లేకుండా బరువు తగ్గడానికి ఇది మంచి సాధనం...
 
సాంప్రదాయ యోగాకు, పవర్ యోగాకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది...పవర్ యోగ వల్ల చాల ఉపయోగాలు ఉన్నాయి...అందుకే మీ మనసును కొంచెం పవర్ యోగ వైపు మళ్లిస్తే మానసికంగా, శారీరకంగా, ఆధ్యాతికంగా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి...ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...
 
సులభంగా బరువు తగ్గవచ్చు - పవర్ యోగ బరువు తగ్గడానికి ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది...దీనిని చేయడం ఎంతో సులభం కానీ చాల పవర్ ఫుల్...ఇది శరీరంలోని కేలరీలు ఖర్చుచేసి బరువు తగ్గిస్తుంది...
 
శరీరానికి అలసట రాదు  - శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడానికి పవర్ యోగ బాగా ఉపయోగపడుతుంది...ఇది శరీరంలోని అన్ని భాగాలను కదిలిపింపజేస్తుంది...దింతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది...
 
జీవక్రియను పెంచుతుంది  - పవర్ యోగాతో మైండ్ ప్రశాంత వాతావరంలోకి వెళ్తుంది...శరీర మెటబాలిజం ఎంతో బాగుంటుంది. అందువల్ల బ్లడ్ సర్కులేషన్ పెరిగి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది...శరీరంలో జీవక్రియ కూడా పెరుగుతుంది...
 
రోగ నిరోధకత పెరుగుతుంది - పవర్ యోగా రోజు చేయడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్ధ మెరుగుపడుతుంది. ఆక్సిజన్ శరీరంలోకి ప్రవేశించి, జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మం కూడా మృదువుగా, అందంగా తయారవుతుంది..
 
వ్యాధులకు మందు -   పవర్ యోగాతో కేన్సర్, ఆస్తమా, బ్రాంకైటిస్, సైనస్ లేదా నిద్రలేమి వ్యాధులను ఎలాంటి మందులు వాడకుండా సహజంగా నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది..
 
ఒత్తిడిని జయించవచ్చు -  యోగాతో మానసిక వత్తిడిని జయించవచ్చు...ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒత్తిడికి లోనవుతూ ఉంటాం అలాంటి సమయంలో పవర్ యోగ చేయడం వల్ల శరీరాన్ని మానసిక ఒత్తిడి నుంచి జయించవచ్చు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.