గులాబీ పూల టీ తాగితే ఏమౌతుందో తెలుసా..?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

rose flowers
Updated:  2018-09-26 05:19:58

గులాబీ పూల టీ తాగితే ఏమౌతుందో తెలుసా..?

ప్ర‌పంచంలో అనేక ర‌కాల టీలు మ‌నం వినే ఉంటాం... అయితే మన దేశంలో అనేక ర‌కాల టీలు ఇప్ప‌టికి సిప్ చేస్తూ ఉంటాం... ఒక్కో ప్రాంతంలో ఒక్కో టీ ఫేమ‌స్ గా ఉంటుంది.. అయితే గులాబీ పువ్వుల టీ గురించి చాలా మంది వినే ఉంటారు... ఓ సారి ఈ గులాబీ పూల టీ తాగితే ఎటువంటి ప్ర‌యోజ‌నం?  అస‌లు ప్ర‌యోజ‌నం ఉందా లేదా తెలుసుకుందాం.
 
గులాబీ అంటే ముళ్లు ఉన్నా స‌రే దాని సువాస‌న చూసి దానికి ముగ్దుల‌ము అయిపోతాం. అలాంటి గులాబీ రేక‌లు సౌంద‌ర్య విలువ‌లు పోష‌కాలు క‌లిగిన‌వి.... అయితే ఆ గులాబీ రేక‌ల‌తో టీ త‌యారు చేయ‌డం అనేది ఏమిటి ? ఓసారి ఈ టీ గురించి దాని లాభాల గురించి తెలుసుకుందాం..?
 
గులాబీ పువ్వుల టీ తయారు చేయ‌డం ఎలా అంటే..?
 
ఒక పాత్రలో కొంత నీటిని తీసుకుని అందులో కొన్ని శుభ్రం చేసిన గులాబీ పువ్వు రేక‌ల‌ను  వేయాలి.  ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో ఆ నీటిలోకి గులాబీ పువ్వు రెక్కల్లో ఉండే ఔషధ పదార్థాలు చేరుతాయి. 20 నిమిషాలపాటు స్లిమ్ లో  ఉంచి మరిగించాలి.. త‌ర్వాత ఓ ద్ర‌వంలా మారుతుంది..ఇందులో కొంత తేనె, నిమ్మరసం వంటివి కలుపుకోవాలి. దీంతో గులాబీ పువ్వుల టీ తయారవుతుంది. 
 
గులాబీ పువ్వుల టీని రోజూ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. చర్మంపై ఉండే మచ్చలు మొటిమలు పోతాయి. చర్మంలో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.  అలాగే . గులాబీ పువ్వు రెక్కల్లో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. నొప్పులు, వాపులు తగ్గుతాయి. 
 
ఇక మహిళలు గులాబీ పువ్వుల టీని తాగితే నెలసరి సరిగ్గా వస్తుంది. ఆ సమయంలో కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వారికి  రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శ‌రీరంలో ఉండే మ‌లినాలు కొలెస్ట్రాల స‌మ‌స్య త‌గ్గుతుంది. ఇక కొవ్వు అనే స‌మ‌స్య మీ ద‌రి చేర‌దు.
 
 గొంతు నొప్పి, దగ్గు, జలుబు, జ్వరం తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం, డయేరియా తగ్గుతాయి. మూత్రాశయ సమస్యలు పోతాయి. మూత్రం సాఫీగా జారీ అవుతుంది.  అలాగే తీవ్ర‌ ఒత్తిడి, ఆందోళన ఉన్న‌వారు ఇది తాగితే కాస్త ఉప‌శ‌మ‌నం పొందుతారు. అందుకే అప్పుడ‌ప్పుడు ఈ గులాబీ టీని టేస్ట్ చేయండి ఆరోగ్యానికి మంచిది అని తెలిసిందిగా...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.