స‌పోటా పండ్ల‌ను తింటే ఎంత ఆరోగ్య‌మో తెలుసుకోండి..?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

sapota fruit
Updated:  2018-09-28 04:50:56

స‌పోటా పండ్ల‌ను తింటే ఎంత ఆరోగ్య‌మో తెలుసుకోండి..?

గుండ్రంగా చూడ‌టానికి బూరెల్లా ఉంటాయి స‌పోటాలు... నోరూరించే ఈ స‌పోటా తినాడానికి ఎంతో మంది ఇష్టం చూపుతారు.. ఆక‌ర్ష‌ణీయ‌కంగా ఉండ‌ట‌మే కాదు చూడ‌టానికి రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు స‌పోటాలు మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. ఇవి త‌రచూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది....  స‌పోటా పండ్ల‌ను రెగ్యుల‌ర్‌గా తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
స‌పోటా పండ్ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి మ‌న‌కు సంపూర్ణ పోష‌ణ‌ను అందిస్తాయి. శ‌రీరానికి శ‌క్తినిచ్చి చురుగ్గా ఉంచుతాయి. మెద‌డు ప‌నితీరును మెరుగుప‌రుస్తాయి. జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విట‌మిన్ సి శ‌రీర రోగ నిరోధ‌క శక్తిని పెంచుతాయి. ఇందులో గ్లూకోజ్ స్ధాయి ఎక్కువ‌గా ఉంటుంది...ఇది క్రీడాకారుల‌కు రెజ్లెర్ల‌కు చాలా మంచిది శ‌క్తిని ఇస్తుంది.
 
ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది ఎముక‌ల బ‌లానికి ఇవి సంవృద్దిగా ఉప‌యోగ‌ప‌డుతాయి.. పిండిపదార్ధాలు, అవసరమైన పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండడం వల్ల గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చాలా ఉపయోగకరం. ఇవి నీరసాన్ని, గర్భం సమయంలో వచ్చే వికారం, మైకం వంటి ఇతర లక్షణాలను తగ్గించడానికి సహాయపడ‌తాయి. మ‌న శ‌రీరంలో బ్యాక్టీరియా రాకుండా నివారిస్తాయి.. ఇక వీటిని త‌ర‌చూ తింటే ఒత్తిడి త‌గ్గుతుంది.
 
ఇవి తిన‌డం వ‌ల్ల జలుబు, ద‌గ్గు కూడా త‌గ్గుతుంది...సపోటాలు మూత్రపిండాల్లో, పిత్తాశయంలో రాళ్ళను తొలగించడానికి సహాయపడి, మూత్రవిసర్జన కారకాలుగా పనిచేస్తాయి. అలాగే ఇవి మూత్రపిండాల వ్యాధుల నుండి రక్షణను అందిస్తాయి. సపోటా పండు బరువు తగ్గడంలో పరోక్షంగా సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ ఎంజైమ్ స్రావాన్ని నియంత్రించడం ద్వారా ఊబకాయాన్ని నిరోధిస్తుంది. తద్వారా జీవక్రియను నియంత్రిస్తుంది. ఇక కొవ్వు పెర‌గ‌దు, అలాగే మ‌ధుమేహగ్ర‌స్తులు వీటికి దూరంగా ఉండ‌టం మంచిది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.