స్ట్రాబెర్రీలను తింటే కలిగే ఆరోగ్య లాభాలు ఇవే ?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

straw berrys
Updated:  2018-08-24 11:55:58

స్ట్రాబెర్రీలను తింటే కలిగే ఆరోగ్య లాభాలు ఇవే ?

స్ట్రాబెర్రీలను మనలో చాలా మంది సలాడ్స్, కస్టర్డ్స్, ఫ్రూట్ జ్యూస్‌ల రూపంలో తీసుకుంటారు. చాలా మంది ఇవి తిన‌డానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు... అయితే ఇవి ఖ‌రీదు ఎక్కువ అలాగే ఆరోగ్యానికి కూడా అంతే మంచివి..  వీటితో ఐస్‌క్రీంలను చేసుకుని తింటారు దానికి మ‌రింత టేస్ట్ వ‌స్తుంది... అందుకే చాక్ లేట్, అలాగే కేక్స్ ,ఐస్ క్రిమ్స్ ప‌లు ఆహార ప‌దార్దాల్లో స్ట్రాబెర్రీల‌ను తీసుకుంటారు చాలా మంది.
 
వీటిని త‌ర‌చూ తీసుకుంటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. స్ట్రాబెర్రీలను రెగ్యులర్‌గా తింటే వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు మనకు మేలు చేస్తాయి... పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఈ క్రమంలో స్ట్రాబెర్రీల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
స్ట్రాబెర్రీలను రెగ్యులర్‌గా తినడం వల్ల కంటి సమస్యలు పోతాయి. చూపు పెరుగుతుంది. కళ్లు పొడిబారడం, దృష్టి లోపాలు, ఇన్‌ఫెక్షన్లు తదితర సమస్యలు రాకుండా ఉంటాయి.  అలాగే  స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్లు రాకుండా చూస్తాయి. 
 
ఇక ఎక్కువ‌గా న‌డివ‌య‌స్సు వారు ఇబ్బంది ప‌డే  కీళ్ల నొప్పులు, గౌట్ సమస్యలు ఉన్న వారు స్ట్రాబెర్రీలను తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే వీటి వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుకే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం శుద్దిచేయ‌బ‌డుతుంది కండ‌రాల నొప్పుల‌కు కూడాచెక్ పెట్ట‌వ‌చ్చు.... శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. రక్తహీనత పోతుంది. గుండె సమస్యలు, హైబీపీ రావు. 
 
ఇక అధిక బరువు తగ్గుతారు. నొప్పులు, వాపులు పోతాయి. గర్భిణీ మహిళలు స్ట్రాబెర్రీలను తింటే బిడ్డకు చక్కని పోషణ అందుతుంది. పుట్టుకతో ఎలాంటి లోపాలు రాకుండా ఉంటాయి.. ఇక మొఖం పై మొటిమ‌లు త‌గ్గుతాయి, జిడ్డు చ‌ర్మం వారికి ఇవి బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అందుకే త‌ర‌చూ స్ట్రాబెర్రీల‌ను తీసుకోండి మంచి ఆరోగ్యం పొందండి.
 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.