తుల‌సి ఆకులు తింటే ఎంత ప్ర‌యోజ‌నం అంటే..?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

tulsi leaves
Updated:  2018-10-01 12:29:54

తుల‌సి ఆకులు తింటే ఎంత ప్ర‌యోజ‌నం అంటే..?

ఆయుర్వేదంలో ఎన్నో ఔష‌ద గుణాలు ఉన్న మొక్క తుల‌సి అయితే తుల‌సి ని దివ్వ ఔష‌ద ప్ర‌దాయిని అంటారు.. తుల‌సి చేసే మేలు ఎంతో ఉంటుంది.. తుల‌సిని మ‌నం దైవంగా పూజిస్తాం. ఇక ఆయుర్వేదంలో తుల‌సితో అనేక ఔష‌దాలుగా వాడ‌తారు. తుల‌సిని రోజూ తీసుకుంటే అనేక రోగాలు మన ద‌రిచేర‌వు.
 
తులసి ఆకులను రోజూ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.... అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. తలనొప్పి, నిద్రలేమి నుంచి ఉపశమనం లభిస్తుంది... యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉండడం వల్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే  జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, జలుబుల నుంచి ఉపశమనం లభిస్తుంది. గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. కీళ్ల నొప్పులు ఉండవు. 
 
తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి.తుల‌సి రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుతుంది
తులసి ఆకులను తినడం వల్ల చర్మ సమస్యలు పోతాయి. చర్మం లోలోపల శుభ్రమై కాంతివంతంగా మారుతుంది. మృదువుగా ఉంటుంది. 
 
అలాగే  డిప్రెషన్, ఆందోళన, మానసిక ఒత్తిడిలను నయం చేసే గుణాలు తులసిలో ఉన్నాయి. మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.  ఇక తుల‌సి తీసుకోవ‌డం వ‌ల్ల  లివర్‌లో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకి వెళ్లిపోతాయి. లివర్ శుభ్రమవుతుంది. శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది..
 
తుల‌సి ర‌సం తీసుకోవ‌డం వల్ల ద‌గ్గు స‌మ‌స్య త‌గ్గుతుంది... ఇక తేనే తుల‌సి ర‌సం తీసుకోవ‌డం వ‌ల్ల గొంతు నొప్పి త‌గ్గుతుంది.... తేనె -అల్లం -తుల‌సి- ర‌సం శ‌రీరంలో వ్య‌ర్దాల‌ను బ‌య‌ట‌కు పంప‌డానికి తోడ్ప‌డ‌తాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.