యోగాతో ఉపయోగాలు?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

yoga uses
Updated:  2018-06-14 12:14:33

యోగాతో ఉపయోగాలు?

రోగనిరోధకశక్తిని పెంపొందించి...బరువును తగ్గించి, ఎలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి, చర్మం అందంగా ఆకర్షణీయంగా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం యోగ...రోజు యోగ చేయడం వల్ల మన నిత్య జీవితంలో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి...
 
1. సామర్ధ్యాన్ని పెంచుతుంది : 
 
యోగ చేయడం వల్ల శారీరక సామర్ధ్యాన్ని పెంచి, మానసికంగా దృడంగా ఉండటానికి తోడ్పడుతుంది...అంతే కాదు ఎలాంటి రోగాలు మన చెంతకు చేరకుండా...ఎటువంటి ఒత్తిడినైనా జయించడానికి ఉపయోగపడుతుంది...
 
2. బరువును తగ్గించడానికి  :
 
సూర్య నమస్కారాలు, కపాల ప్రాణాయామం వంటి వ్యాయామాలతో తేలికగా శారీరియానికి ఎలాంటి ఒత్తిడిని కలిగించకుండా అధిక బరువును తగ్గించుకోవచ్చు... యోగ వల్ల కేలరీలు ఖర్చవుతాయి..దాంతో బరువు సులభంగా తగ్గవచ్చు...
 
3. ఒత్తిడి నుంచి బయటపడాలంటే :
 
మనం ఎన్నో సమస్యలతో ఎంతో ఒత్తిడికి లోనవుతూ ఉంటాం...ఆలా ఒత్తిడిలో ఉన్నప్పుడు మంకు తెలియకుండానే తప్పులు చేస్తుంటాం...అందుకే యతిని దూరం చేసుకోవడానికి యోగ ఎంతో ఉపయోగపడుతుంది...యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడం వల్ల  శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.
 
4. మానసిక ప్రశాంతత :
 
ప్రశాంతత అనేది మనసులోనే ఉంటుంది...కానీ మనం అది గుర్తించక ఏదైనా ప్రదేశాలు చూసినప్పుడే అలాంటి అనందం కలుగుతుందని అనుకుంటాం...కానీ ఇలాంటి అనుభూతిని పొందాలంటే యోగాతో సాధ్యమవుతుంది...యోగ చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది...
 
5. రోగ నిరోధక శక్తి పెంపు :
 
శరీరంలో ఏదైనా సమస్య వస్తే, అది మనసుపైనా ప్రభావం చూపుతుంది. అలాగే మనసులోని అశాంతి, అసంతృప్తి వంటివీ శరీరాన్ని ప్రభావితం చేసి వ్యాధుల రూపంలో బయటపడతాయి. యోగా ద్వారా ఈ రెంటినీ నివారించుకోవచ్చు. ఫలితంగా రోగనిరోధకశక్తి పెంపొంది వ్యాధుల నుండి బయటపడవచ్చు...
 
6. చైతన్య జీవనం :
 
మనసు ఎప్పుడు ఒకే చోట ఉండదు...ఒకచోట నుండి మరొక చోటుకి నిత్యం పరుగెడుతూ ఉంటుంది...దానిని మనం నియంత్రించి, మన అదుపులో పెట్టుకోవాలంటే ఒకే ఒక మార్గం యోగ...యోగ చేయడం వల్ల మనసును మనం చెప్పినట్టు నడిచేటట్టు చేసుకోవచ్చు...ఇలా చేస్తే ఏకాగ్రత ఉంటుంది...
 
7. కొత్త శక్తి :
 
ఉదయం నిద్ర లేవగానే ఉండే హుషారు గంటలు గడిచే కొద్దీ కొంచెం కొంచెం కోల్పోతూ ఉంటాం... ప్రతి రోజూ కొద్దిసేపు యోగా చేయటం వల్ల రోజంతా హుషారుగా ఉండటమే కాదు, ఒంట్లోనూ కొత్త శక్తి వస్తుంది...
 
8. కదలికలు సులభం :
 
ప్రతి రోజు యోగ చేయడం వల్ల కొండరాలు సాగి, బలంగా తయారవుతాయి...దింతో రక్తప్రసరణ బాగా జరిగి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది...
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.