యోగా అంటే..? మనకు వచ్చే లాభం ఏంటి ..?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

yoga
Updated:  2018-06-13 06:53:34

యోగా అంటే..? మనకు వచ్చే లాభం ఏంటి ..?

యోగా ఒక జీవన విధానం... అది అనాదిగా వస్తున్న సనాతన సత్సంప్రదాయం ..యావత్ ప్రపంచానికే  నాగరికతను నేర్పిన ఏకైక దేశం .భారత దేశం, ....వేద భూమి గా , పుణ్య భూమి గా  అనేక దేశాల నాగరికులకు ఆధ్యాత్మిక భిక్షను పెట్టింది భారతదేశం, మనిషి శారీరకంగా ఉంటే ఏమైనా సాధించగలడు...బలంగా ఉంటేనే విజయాలు సాధ్యమవుతాయి...అలా మనస్సు, శరీరం మెదడు అదుపులో ఉండాలన్నా, మనం చేసే పనిలో ఏకాగ్రత కుదరాలన్నా, మనం చేయబోయే పనులకు  మంచి ప్రణాళికలను  ఏర్పాటు చేసుకావాలన్నా....ఏకైక మార్గం యోగా...
 
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎట్టకేలకు మన యోగా జీవన విధానానికి, అంతర్జాతీయ స్థాయి లభించింది...ఇది ఎంతో హర్షించదగ్గ విషయం...ఈ నేపధ్యం లో ప్రపంచదేశాలు భారత దేశం వైపు తొంగి చూస్తున్నాయి...వారందరూ మన యోగా విధానాన్ని అభ్యాసం చేస్తున్నారు...కానీ భారతీయులు  మన పురాతాన జీవన విధానం అయిన యోగాను  మర్చిపోవడం ప్రతి సామాన్యుడు తలదించుకోవలసిన విషయం....ఆధునిక నాగరికత దిశలో  మనిషి , విజ్ఞానం  ఎంత వికసించినా శారీరక ధృడత్వం లోపించడం వల్ల మనిషి ఆయువు రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది... గజిబిజి జీవితాల నడుమ, యోగా అభ్యాసానికి గంట సమయాన్ని కూడా వెచ్చించ లేకుండా పోతున్నాడు.....ఉదయం మనం చేసే ఒక గంట యోగా అభ్యాసం...మిగిలిన సమయాన్ని ఎంతో  ఆనందంగా ఆహ్లాదకరంగా  జరిగేలా చేస్తుంది....
 
ఆనారోగ్యం పాలయ్యాక లక్షలు  ఖర్చు చేసే బదులు.. ఆ అనారోగ్యబారిన పడకుండా ముందస్తుగా మనం చేసే యోగా మన జీవితానికి ఎంతో మేలు చేస్తుంది...మన ఆయువు వృద్ధి రేటు ను పెంచుతుంది...
 
యోగా అంటే..?
 
యోగా  అంటే కలయిక, శరీరానికి  మనసుకు కలయిక, మనసుకి ఆత్మ కి కలయిక, ఆత్మకు పరమాత్మకు కలయిక... యోగాశ్చిత్త వృత్తి నిరోధ: అంటే చిత్త ప్రవృత్తుల నిరోధమే యోగ అన్నమాట. యోగా అనెది మనస్సును, మన ప్రవృత్తిని మారుస్తుంది....మన జీవితానికి ఒక నడవడికను నేర్పిస్తుంది... యోగ అంటే అదృష్టం, కూడిక, కలయిక, సంబంధం, ధ్యానం, ఇలా ఎన్నో అర్థాలు యోగకు ఉన్నాయి.అదృష్టం అను అర్థంలో యోగ శబ్దాన్ని వాడుతూ యోగం బాగుండటం వల్ల ఇంతవాడుఅంతవాడు అయినాడని అంటూ ఉంటారు పెద్దలు. కూడిక అను అర్థంలో యోగ శబ్దాన్ని వాడుతూ ఒకటి ప్రక్కన సున్నా చేరిస్తే పది, పది ప్రక్కన ఆరు చేరిస్తే పదహారు, నాలుగు నాలుగు కలిపితే ఎనిమిది, ఎనిమిది అయిదు కలిపితే పదమూడు అని అనడం మనకు తెలుసు.
 
కలయిక లేక సంబంధం అను అర్థంలో యోగ శబ్దాన్ని వాడుతూ తల్లి - కొడుకు, తల్లి - కూతురు, తండ్రి - కొడుకు, తండ్రి - కూతురు, భార్య భర్త, అత్త - కోడలు, గురువు -శిష్యుడు అని అంటూ వుంటారు. మరికొంచెం మనం ముందుకు వెళ్లి ఆత్మ - పరమాత్మల కలయిక కోసం చేసేప్రయత్నాన్ని ధ్యానం అని అంటారు. ఇది ఏకాగ్రతపై ఆధారపడి ఉంటుంది. 
 
దీనికి విశ్వాసం, నమ్మకం చాలా అవసరం.యోగ శాస్త్రంలో ధ్యానం ఒక ప్రధానమైన అంశం. ధ్యానం దేని కోసం అని అడిగితే ఆత్మపరమాత్మల కలయిక లేక ఆత్మ సాక్షాత్కారం కోసం అని సమాధానం లభిస్తుంది మనకు. ఇది సాధ్యమా అని అడిగితే చిత్త ప్రవృత్తుల్ని, ముఖ్యంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద,  మాత్సర్యాల్ని జయించగలిగితే సాధ్యమేనని సమాధానం లభిస్తుంది. కాబట్టి మన జీవితాన్ని మన ఆయువును పెంచుకోవాలంటే ఎకైక మార్గం యోగా...ఇప్పటికే ఎన్నో సంస్థలు దీనిపై దృష్టి సారించాయి...దీనిపై మరింత అవగాహన రావలసిన అవసరం ఉంది...కేంద్ర ప్రభుత్వం ఆయుష్ ప్రత్యేక కమిటీ విభాగం,  యోగ పై అనేక కోర్సులను అందిస్తోంది....వాటిపై ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తోంది...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.