ఉద్యోగం చేసేవారు తప్పకుండ చేయవలసిన అద్భుతమైన యోగాసనాలు

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

employees yoga
Updated:  2018-06-14 13:03:51

ఉద్యోగం చేసేవారు తప్పకుండ చేయవలసిన అద్భుతమైన యోగాసనాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు ఉద్యోగాలకు అతుక్కుపోతున్నారు....ఉదయం సమయంలో ఒక గంటపాటు యోగాను చేసే పరిస్థితులు కనిపించటం లేదు...అదేపనిగా 8 గంటలు, 12 గంటలు ఒకే స్థలంలో కూర్చొని పనులు చేయటం వల్ల ఎన్నో రోగాలను కొనితెచ్చుకునే పరిస్థితి ఎర్పడుతుంది....కాబట్టి  ఉద్యోగులు యోగాలో కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు చేయటం వల్ల వారు రోజు మొత్తం లో అనుభవించే ఒత్తిడి నుండి బయటపడవచ్చు...అలాగే చురుగ్గా ఉండవచ్చు....
 
కూర్చోవడం, నిల్చొవడం సరైన పద్ధతిలో లేకపోతే సయాటికా నొప్పి వస్తుంది. ల్యాప్‌టాప్‌లను ఎక్కువ సమయం శరీరానికి దగ్గరగా ఉంచడం వల్ల ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువవుతాయి. ఈ సమస్యల నుంచి గట్టెక్కాలంటే పార్శ కోణాసనాన్ని వేయాలి. కాలి మడమలు, మోకాళ్లు మొదలైన వాటిని ఉత్తేజపరుస్తుంది. సయాటికా, కీళ్లనొప్పులను నివారిస్తుంది. నడుము చుట్టూ ఉండే కొవ్వును తగ్గిస్తుంది.మలబద్దకాన్ని నివారిస్తుంది. మోకాలి నొప్పులు ఉన్నవారు చేయకూడదు.
 
ఆఫీసులో దాదాపు 8 గంటలపాటు కూర్చునే ఉంటాం. ఆ సమయంలో.. కూర్చునే పద్ధతి సరిగా ఉండదు. గాలి కూడా సరిగా పీల్చం. ఒక్కొక్కసారి ఊపిరి బిగబట్టి కంప్యూటర్‌కు అతుక్కుపోతాం. అలా చేయడం వల్ల శరీరం చాలా అలసిపోతుంది. కాబట్టి కనీసం మూడు గంటలకోసారి అయినా డీప్ బ్రీతింగ్ తప్పనిసరి. అంతేకాకుండా ఈ వ్యాయామాలు కూడా చేస్తే ఒత్తిడి సమస్య నుంచి కూడా దూరం కావచ్చు.
 
ప్రతిరోజూ మనం చేసే పనిలో ఆందోళన, ఒత్తిడి ఉంటాయి. వీటివల్ల ఊబకాయం వచ్చేస్తుంది. అదే పనిగా, కూర్చోవడం వల్ల పొట్ట చొచ్చుకొని ముందుకు వస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేసి, తీసుకునే ఆహారంలోని పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికే ఈ ఆసనాలు వేయవచ్చు .. ఏకపాద పవన ముక్తాసనం, ద్విపాద పవన ముక్తాసనం, దీనివల్ల  పొట్టచుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. పాంక్రియాస్ ని  ఉత్తేజితం చేస్తుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారికి మంచిది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.నడుము భాగాన్ని ఉత్తేజితం చేస్తుంది. పునరుత్పత్తి అవయవాల పనితీరును క్రమపరుస్తుంది.
 
అలాగే సుప్త వజ్రాసనం...ఈ ఆసనం వేయటం వల్ల ఊపిరితిత్తులు, పక్కటెముకలకు మంచి శక్తినిస్తుంది. ఆస్తమా ఉన్నవారికి చాలా మంచిది. కాలి కండరాలను బలోపేతం చేస్తుంది.  అలాగే వృక్షాసనం...ఏదో పనిచేస్తున్నాం, అయిపోయింది అనుకుంటే ఎలా? ఏ పనినైనా ఏకాగ్రతతో చేసినప్పుడే అది విజయవంతంగా పూర్తవుతుంది. లేకపోతే చివాట్లు తప్పవు. ఏకాగ్రత కుదరాలంటే మరి ఈ ఆసనం ప్రయత్నం చేయండి. మెరుగైన ఫలితాలను పొందండి..
 
అయితే యోగా చేయడానికి ముందు వామప్ చేయాలి. మణికట్టుకి సంబంధించిన వ్యాయామాలు ఏవైనా అమనం చేసుకోవచ్చు అందుబాటులో ఉన్నాయి. ఇవి చేశాకే మిగతా ఆసనాలను వేయాలని మరచిపోవద్దు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.