CPMలో ముసలం

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

Updated:  2018-01-23 09:05:47

CPMలో ముసలం

సీపిఎమ్  పార్టీలో  ముస‌లం మొద‌లైంది. ఆ పార్టీ  జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్న  సీతారాం ఏచూరి ఏకంగా రాజీనామాకు సిద్ద‌ప‌డ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయిన‌టువంటి ఏచూరి రాజీనామా చేయాల‌నుకోవ‌డం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. 

ఎన్టీయే ప్ర‌భుత్వాన్ని ఢీ కొట్టేందుకు  రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో  క‌లిసి ప‌ని చేద్దామ‌ని ఏచూరి ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింది.   ఇందుకు పోలిట్ బ్యూరో,  సెంట్ర‌ల్ క‌మిటీ ఆమోదించ‌లేదు. దీంతో ఈ వ్య‌వ‌హారంపై ఏకంగా ఓటింగ్ నిర్వ‌హించారు.

ఈ ఓటింగ్ లో మెజారిటీ స‌భ్యులు కాంగ్రెస్ తో పొత్తుకు వ్య‌తిరేకంగా ఓటింగ్ వేశారు. దీంతో మ‌న‌స్తాపానికి గురి అయిన ఏచూరి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ద‌ప‌డ్డారు. కాని పార్టీ నేత‌లు ఆయ‌న్ను  స‌ముదాయించిన‌ట్లు తెలుస్తోంది. 

మెజారిటీ స‌భ్యులు ఏచూరి ప్ర‌తిపాద‌న‌ను తోసిపుచ్చేందుకు అనేక రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఉన్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో క‌లిసి ప‌నిచేస్తే త‌మ పార్టీకి తీవ్ర న‌ష్టం జరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌నేది వారి వాద‌న‌. ముఖ్యంగా కాంగ్రెస్ తో పొత్తు  కార‌ణంగా కేర‌ళ వంటి కంచుకోట‌ను కూడా చేజారిపోయే  అవ‌కాశాలు ఉన్నాయ‌నే అంచ‌నాకు వ‌చ్చారు సీపీఎమ్ నేత‌లు.

దీంతో పాటు మిగ‌తా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను అంచానా వేసుకుని కాంగ్రెస్ పార్టీ తో మ‌ద్ద‌తు పెట్టుకుందామ‌న్న  ఏచూరి ప్ర‌తిపాద‌న‌ను తిర‌ష్క‌రించిన‌ట్లు స‌మాచారం.  మొత్తానికి కేంద్ర క‌మిటీ, పాలిట్ బ్యూరో కోరిక మేర‌కు  ఏచూరి త‌న రాజీనామా నిర్ణ‌యాన్ని  వెన‌క్కు తీసుకున్నారు. 

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.