కువైట్ లో ఘ‌నంగా వాక్ విత్ జగన్ కార్యక్రమం

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

Updated:  2018-01-27 12:01:55

కువైట్ లో ఘ‌నంగా వాక్ విత్ జగన్ కార్యక్రమం

మాలియా ప్రాంతములో రాష్ట్ర పార్టీ అధిష్టానం మేరకు కువైట్ కో కన్వీనర్ యం. నరసారెడ్డి, ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వాక్ విత్ జ‌గ‌న్ కార్యక్రమము ఘనంగా జరిగిందని గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ..... రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంద‌ని ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఖూని చేస్తున్నారని, మంత్రులు రాత్రికి రాత్రి ప్రజలకు డబ్బులు పంచి అధికారంలో వస్తామని చెప్పడం సిగ్గు చేటుగా ఉందని, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు త‌మ అధినేత వై.యస్, జగన్ మోహాన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర 1000 కి.మీ పూర్తి అయినందుకు వారికి సంఘీభావంగా కువైట్ పాదయాత్ర నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమము నిర్వహించిన యం.వినరసారెడ్డి, మహేష్ రెడ్డి అభినందించారు.

కో కన్వీనర్ గోవిందు నాగరాజు మాట్లాడుతూ... 2019 లో జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునే దిశగా ప్రవాసం లో ఉన్న ఆంధ్ర రాష్ట్ర వాసులు జగన్ కు అండగా ఉండాలని అభ్యర్ధించారు.

ఈ కార్యక్రమములో బిసి విభాగం లీడర్ రమణ యాదవ్ యువజన విభాగం లీడర్ మర్రి కళ్యాణ్ , సోషల్ మీడియా విభాగం లీడర్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మైనారిటీ విభాగం లీడర్ గఫార్, గల్ఫ్ ప్రతినిధి షేఖ్ నాసిర్ SC& ST విభాగం లీడర్ బి.యం. సింహ, రావూరి రమణ సయ్యద్ సజ్జాద్ పిడుగు సుబ్బారెడ్డి రహంతుల్లా, జిలేబి బాషా గౌస్ బాషా ముద్దా సుబ్బారావు కువైట్ కమిటి ముఖ్య నాయకులతో పాటు, రెడ్డిసంఘం గౌరవ అధ్యక్షులు మన్నూరు చంద్రశేఖర్ రెడ్డిఅధ్యక్షులు బత్తిన శివారెడ్డి ఉపాధ్యక్షులు చింతల చంద్రశేఖర్ రెడ్డి పులపుత్తూరు సురేష్ రెడ్డి సభ్యులు జగన్ హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షులు జబీబుల్లా జగన్ సైన్యం అధ్యక్షులు బాషా భారీగా వై.యస్.ఆర్. కుటుంబ అభిమానులు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.