అబ్బాయిల‌కు అది ఎర‌వేసి ఏం చేసిందంటే ?

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

Updated:  2018-01-25 04:24:46

అబ్బాయిల‌కు అది ఎర‌వేసి ఏం చేసిందంటే ?

ప్ర‌స్తుత స‌మాజంలో టెక్నాల‌జీ పెరిగే కొద్ది ఏది న‌మ్మాలో, ఏది న‌మ్మకూడ‌దో తెలియ‌ని ప‌రిస్థితిలో చాలా మంది యువ‌తీ, యువ‌కులు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు... అయితే ఇదే విష‌యాన్ని చ‌నువుగా తీసుకొని కొంత‌మంది స్త్రీ, పురుషులు ఉన్న‌త  చ‌దువులు చ‌దివిన‌ప్ప‌టికి మోస‌పూరిత‌మైన ప‌నులు చేస్తున్నారు... 
 
అయితే తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన దీప్తి అనే మ‌హిళ  మూడు సంవ‌త్సరాల క్రితం గుంటూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ యువ‌కుడిని వివాహం చేసుకుంది... వివాహం చేసుకున్న త‌ర్వాత కొంత కాలంగా దీప్తి త‌న త‌ల్లి వ‌ద్ద కృష్ణా జిల్లాలో నివాసం ఉంటూ సుఖ జీవితాన్ని అల‌వాటు చేసుకుంది.
 
దీంతో ఆమె విలాస‌వంత‌మైన జీవితానికి అల‌వాటు ప‌డ‌డంతో తెలుగు మ్యాట్రిమోనిలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంది... డ‌బ్బులున్న యువ‌కుల‌కు  ఎర‌వేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఎంచుకుని త‌న ఫోటోకు బ‌దులు అందంగా వున్న న‌కిలీ ఫోటోను మ్యాట్రిమోనిలో పెట్టింది... అయితే ఈ క్ర‌మంలో అమెరికాలో ఉంటున్న విజ‌య‌వాడ‌కు చేందిన ధ‌ర‌ని కుమార్ అనే సాఫ్ట్ వేర్ యువ‌కుడు దీప్తికి ప‌రిచ‌య‌మ‌య్యాడు.
 
అయితే అత‌ని ప‌రిచ‌యాన్ని దీప్తి చ‌నువుగా చేసుకుని.. పెళ్లి చేసుకుంటాన‌ని నాలుగు మాయ‌మాట‌లు చెప్పి,  ధ‌ర‌ని కుమార్ ద‌గ్గ‌నుంచి సుమారు 1.99 ల‌క్ష‌లు కాజేసింది...  త‌న‌ని మోసం చేసింద‌న్న విష‌యాన్ని ఆల‌స్యంగా తెలుకుని, ఫోర్త్ ల‌య‌న్ యాప్ లో విజ‌య‌వాడ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.... అత‌ని ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసున‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు... ఈ ద‌ర్యాప్తులో దీప్తికి  సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి... ఇంత‌కు ముందే ఈమె మ‌రో ఇద్దరు యువ‌కుల‌ను మోసం చేసి వారి వ‌ద్ద‌ నుంచి అధిక మొత్తంలో న‌గ‌దును కాజేసింద‌ని పోలీసులు వెల్ల‌డించారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.