కడప శాసన సభ్యులు అంజాద్ బాషా జన్మదిన వేడుకలు

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

ysrcp leaders
Updated:  2018-08-13 17:59:05

కడప శాసన సభ్యులు అంజాద్ బాషా జన్మదిన వేడుకలు

వైకాపా కువైట్ మైనారిటీ సభ్యులు షేక్ షా హుస్సేన్, షేక్ రహమతుల్లా ఆధ్వర్యములో భారీ కేక్ కట్ చేసి అంజాద్ బాషా జన్మ దిన వేడుక MLA ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. 
 
ఈ సందర్భముగా గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, షా  హుస్సేన్, రహమతుల్లా మాట్లాడుతూ మైనారిటీల ఆశ జ్యోతి ప్రజల మనిషి అంజాద్ బాషాకి కువైట్, ఖతార్ కమిటీ సభ్యుల అందరి 47 వ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని 2019 లో అత్య‌ధిక‌ మెజార్టీతో గెలిచి మంత్రి పదవి అధిష్టించాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నామన్నారు.
 
ఈ కార్యక్రములో గల్ఫ్ ప్రతినిధులు ఎస్. ఫయాజ్ బాషా, జి.ఎస్.బాబు రాయుడు, యూత్ ఇంచార్చ్ మర్రి కళ్యాణ్, సాంస్కృతిక విభాగం ఇంచార్చ్ కె. వాసుదేవరెడ్డి, సభ్యులు శబ్దర్, NRI లు షేక్ ఆన్సర్, సిటీ ఆలీ, షేక్ గయాజ్, బాబు భై, లక్కీ అజిస్, సయ్యద్ మౌల, మరియు రేల్వే కోడూరు వై. కోట మైనారిటీ యూత్ పాల్గొన్నారు.

షేర్ :