కువైట్ లో ఘనంగా ఈద్ ఆల్ ఆదా (బక్రీద్)

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

bakrid
Updated:  2018-08-21 17:28:06

కువైట్ లో ఘనంగా ఈద్ ఆల్ ఆదా (బక్రీద్)

మాలియా ప్రాంతములో పవన్ రెస్టారెంట్ వద్ద వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ గవర్నింగ్  కౌన్సిల్ సభ్యుడు పి. రెహామన్ ఖాన్ ఆధ్వర్యములో బక్రీద్ పండగ సందర్భముగా ఈద్ మిలాప్ పేరుతో సుమారు 750 మందికి సేమియా పాయసం (షీర్ ఖుర్మా) పంచారు. ఈ కార్యక్రమములో హిందు ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారని గల్ఫ్, కువైట్, కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 
 
ఈ సందర్భముగా కువైట్ లో ప్రతి రాంజాన్, బక్రీద్ పండగలకు ఈద్ మిలాప్ పేరుతో హిందూ ముస్లిం సోదరులను ఒక వేదికపై చేర్చి ఒకానొకరు శుభాకాంక్షలు తెలుపుకొనే అవకాశం  కల్పించి మతసామరస్యానికి పెద్దపీట వేయడం జరుగుతోందని గత 2 సం: ల నుండి రెహామన్ ఈద్ మిలాప్ కార్యక్రమము నిర్వహిస్తున్నందుకు కమిటీ సభ్యులు అందరి తరపున ఇలియాస్ మరియు బాలిరెడ్డి అభినందనలు తెలిపారు. 
bakrid
 
కార్య నిర్వాహుకులు రెహామన్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు కువైట్ లో ఉండే ప్రవాసాంధ్రులు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశము కల్పించిన గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ కి బాలిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం. వి. నరసారెడ్డి, ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి, గవర్నింగ్  కౌన్సిల్ సభ్యుడు తెట్టు రఫీ, వై.యస్.లాజరస్, సలహాదారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, షేక్ ఇనాయత్, ఆబూతురాబ్, గల్ఫ్ ప్రతినిధి షేక్ నాసర్,  ముస్లిం మైనారిటీ ఇంచార్చ్ షేక్ గఫార్, మీడియా ప్రతినిధి పి. సురేష్ రెడ్డి.యూత్ సభ్యుడు షేక్ శబ్దర్, జగన్ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు షేక్. జబీవుల్లా, జగన్ యూత్ ఫోర్స్ అధ్యక్షుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.   

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.