జగన్ సీఎం కావాల్సిన అవసరం ఉంది-దొండపాటిశశికిరణ్

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

Updated:  2018-01-21 02:18:02

జగన్ సీఎం కావాల్సిన అవసరం ఉంది-దొండపాటిశశికిరణ్

ఎస్.ఎస్. రావు  విల్లా, ఆయిన్ ఖాలిద్ ప్రాంతములో దొండపాటి  శశికిరణ్ఆధ్వర్యములో  నూతన కమిటీ సమావేశము జరిగిందని గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్, గల్ఫ్ ప్రతినిధి వర్జిల్ బాబు  ఓ  ప్రకటనలో తెలియ‌జేశారు. 

ఈ సంద‌ర్భంగా శ‌శికిర‌ణ్  మాట్లాడుతూ..... రాష్ట్ర ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని ఆ సమస్యలను పరిష్కార మార్గం చూడాలనే ఉద్దేశ్యంతో  గత 68 రోజులుగా ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైయ‌స్  జగన్ మోహన్ రెడ్డికి  మద్దతుగా.... ఖతార్ నుండి నూతన కమిటీ ఏర్పడిన వెంటనే సుమారు 15 మంది ఖతార్ నుండి ప్రజాసంకల్పయాత్రలో పాల్గొనాలని,  జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్దితోపాటు  అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. 

ప్రముఖ వ్యాపారవేత్త సాంబశివరావు, వర్జిల్ బాబు మాట్లాడుతూ... రాష్ట్రంలో రాక్షస పాలన ఉందని రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన   బాధ్యత తెలుగు వారు ఎక్కడ ఉన్న  వారిపై ఉందన్నారు. ఫాస్టర్ బుల్లెబ్బాయి   జగన్ మోహన్ రెడ్డి  ఆరోగ్యం బాగా ఉండాలని,  ప్రజా సంకల్పయాత్రలో ఎటువంటి ఆటంకాలు కలగకూడదని పార్ధన చేశారు. 

ఈ కార్యక్రమములో సామాజిక సేవకులు బి. విల్సన్ బాబు, వర్జిల్ బాబు, నల్లి నాగేశ్వరరావు, వర్ధనపు ప్రకాష్ బాబు, ఆరోన్ మానిష్ రెడ్డి, పెద్దిరెడ్డి శ్రీరామ్ రెడ్డి, ఎస్. షహాబుద్దీన్, ఎం. ప్రశాంత్, ఎస్. సుభాన్, బి. గిరిధర్, ఇంజేటి శ్రీను, గడ్డం చంటి, తదితరులు పాల్గొన్నారు, వచ్చిన అతిధితులకు సాంబశివ రావు విందు ఏర్పాటు చేశారు.

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.