కువైట్‌లో ఘ‌నంగా ఇఫ్తార్ విందు

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

ysrcp kuwait followers
Updated:  2018-06-14 11:10:49

కువైట్‌లో ఘ‌నంగా ఇఫ్తార్ విందు

ఎడారి దేశాలైన  కువైట్, దోహా ఖతార్ లో వై.యస్.ఆర్. కమిటి ఆధ్వర్యంలో  ఘనంగా ఇఫ్తార్ విందు ముఖ్య అతిధులుగా కమలాపురం శాసన సభ్యులు పి. రవింద్రనాధ్ రెడ్డి, కడప శాసన సభ్యులు ఎస్.బి. అంజాద్ బాషా, 
 
గల్ఫ్: 11-06-18న దోహాఖాతర్ లో కో కన్వీనర్  గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు మరియు వై.యస్.ఆర్. మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లో గెలిచినవారికి  కప్పుమరియు  బహుమతులు  అందజేయడం జరిగింది. 
 
కువైట్ లో 12-06-18న  కమిటి సభ్యుల ఆధ్వర్యములో భారీగా ఇఫ్తార్ విందు జరిగింది. 
 
ఈ సందర్భముగా ముఖ్య అతిధులు పి. రవింద్రనాధ్ రెడ్డి గారు, ఎస్.బి. అంజాద్ బాషా గారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో గల్ఫ్ ప్రాంతాలైన ఖతార్, కువైట్ దేశాలలో మత సమసర్యానికి  ప్రతీక  అయినా ఇఫ్తార్ విందుకు హాజరు కావడం చాల సంతోషంగా ఉందని. 
kuwait
 
మీ కుటుంబ ఉజ్వల భవిష్యత్తు కోరకు మీరు ఈ ఎడారి దేశం వచ్చి కష్టపడుతు మరియు పార్టీపై ఉన్న అభిమానంతో ఇంత పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికి భారీ ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. పార్టీ కొరకు మీరు శ్రమిస్తున్న తీరు చుస్తే పార్టీ అధిష్టానం మేము మీ అందరికి రుణపడిఉంటామని తెలిశారు. 
kuwait ysrcp
 
గల్ఫ్, కువైట్, ఖతార్ కన్వీనర్లు మరియు కువైట్ కో కన్వీనర్, గవర్నింగ్  కౌన్సిల్ సభ్యుడు, మైనారిటీ ఇంచార్చ్ గల్ఫ్ లో ఉన్న సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు ముఖ్య అతిధులు సానుకూలంగా స్పందించి తప్పకుండా అధినేత దృష్టికి తీసుకోని పోయి పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఈ సమస్యలను చేర్పించి తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
 
మరియు ఈ ఇఫ్తార్ విందులో కువైట్, ఖతార్ ముఖ్య నాయకులు కార్యవర్గ సభ్యులు మరియు వై.యస్.ఆర్. కుటుంబ అభిమానులు భారీగా పాల్గోన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన్నారు.  ముఖ్య అతిధులకు కువైట్, ఖతార్ కమిటిల తరపున శాలువా కప్పి మొమెంటోస్  ఇచ్చి ఘనంగా సన్మానించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.