ఐపీఎల్ ఆల్‌టైమ్‌ రికార్డు 46.5

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

Updated:  2018-02-09 04:55:47

ఐపీఎల్ ఆల్‌టైమ్‌ రికార్డు 46.5

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ లీగ్స్ లో ఐపీఎల్ ది ఎంతో క్రేజ్ లీగ్... దీని క్రేజ్ ఎంతో మ‌న‌కు తెలిసిందే.  అన్నిటికంటే అగ్ర‌స్ధానంలో ఉండే లీగ్ ఇదే..ఆద‌ర‌ణ ప‌రంగా వీక్ష‌కుల ప‌రంగా బ్రాండ్ ఉన్న లీగ్ కూడా ఇదే.. అందుకే దీనికి ఇంత విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది... అందుకే ఐపీఎల్ వేలం అంటే ఎంతో ఆతృత‌గా ఆట‌గాళ్లు - ఇటు వీక్ష‌కులు చూస్తూ ఉంటారు.
 
అస‌లు మ‌న వాళ్లు లైవ్ మ్యాచ్ అంటే కళ్లు కాయ‌లు కాసేలా చూస్తారు.. అలాంటిది ఈ సారి ఐపీఎల్ వేలం గురించి కూడా ఎక్కువ స్ధాయిలో చూశారు అభిమానులు...  అవును కాస్త స్టాటిస్టిక్స్ చూసిన‌ట్టు అయితే, గ‌త‌ నెలలో ఐపీఎల్‌-11 సీజన్‌ కోసం బెంగళూరులో రెండు రోజుల పాటు నిర్వహించిన వేలాన్నిభారీ స్థాయిలో వీక్షించారు అభిమానులు.
 
 ఐపీఎల్ ఆటగాళ్ల కోసం నిర్వహించిన వేలాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేసింది..ఈ  వేలం ప్రక్రియను 46.5 మిలియన్ల మంది వీక్షించినట్లు ఈ  సంస్థ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇది ఐదు రెట్లు అధికం అని తెలుస్తోంది. దాంతో ఆల్‌ టైమ్‌ రికార్డును నమోదు చేసింది ఈ ఐపీఎల్ వేలం ప్ర‌క్రియ‌. ఈ వేలం కార్యక్రమాన్ని ఆరు ఛానెళ్లలో టెలికాస్ట్ చేసింది. 
 
 అలాగే టీవీతో పాటు డిటిటల్ ఫ్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో వీక్షకుల సంఖ్య ఐదు రెట్లు పెరిగినట్లు స్టార్ సంస్థ  ఓప్ర‌క‌ట‌న‌తో తెలిపింది... అలాగే ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో ఆదరణ లభించిందని స్టార్‌ ఇండియా ఎండీ సంజయ్‌ గుప్తా తెలిపారు.. మొత్తానికి  మ‌నోళ్లు మ్యాచ్ లు ఆడ‌కుండానే ఓ రేంజ్ కు తీసుకువెళ్లారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.