జ‌గ‌న్ కోసం మేము సైతం..

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

jagan
Updated:  2018-09-25 11:18:54

జ‌గ‌న్ కోసం మేము సైతం..

వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కువైట్ బి.సి. ఇంచార్చ్ కె.రమణ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం యాదవ్ సామాజిక వర్గానికి చెందిన బి.మణి యాదవ్, బి.వెంకటేష్ యాదవ్, ఎస్. గంగాధర్ యాదవ్, ఎస్.నరసింహా యాదవ్, లు జివోనోపాధి కొరకు కువైట్ వచ్చి జననేత జగన్ మోహన్ రెడ్డి గారిపై ఉన్న ఎనలేని అభిమానాన్ని చాటుతూ "మేము సైతం జగనన్న కోసం" అనే సంస్ధ ఏర్పాటు చేసి ప్రజా సంకల్ప పాదయాత్ర 3000 వేల కి.మీ. దాటుతున్న సందర్భముగా సంఘీభావం తెలపాలని కువైట్ లో 30 కిలోల కేక్ కట్ చేసి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుమారు 500 మంది అతిధులకు విందు ఏర్పాటు చేశారని తెలిపారు. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పాల్గొన్న గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి గారు మాట్లాడుతూ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ స్ధాపించి అప్పటి నుండి నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక నాయకుడు మా అధినేత జగన్ మోహన్ రెడ్డిని తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు  2014 లో ఎన్నికల సమయములో ఇచ్చిన మోసాపూరిత ఉచిత వాగ్దానాలను ఎండగడుతూ రాష్ట్ర ప్రజల సాధక బాధలు తెలుసు కుంటూ ప్రజలకు ఎలాంటి సంక్షేమ పధకాలు అవసరమో ప్రజల  ద్వారానే తెలుసుకోవాలని మంచి ఉద్దేశ్యముతో ఇడుపులాపాయ నుండి ఇచ్చాపురం వరకు సుదీర్ఘ ప్రజాసంక ల్ప పాదయాత్ర చేస్తూ 3000 వేల కి.మీ. దాటుతున్న సందర్భముగా సంఘీభావం కార్యక్రమాన్ని భారీగా ఏర్పాటు చేసిన "మేము సైతం జగనన్న కోసం" సంఘం కార్యవర్గ సభ్యులకు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటీ సభ్యుల తరపున అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలుపుతూ 2019 ఎన్నికల సమయములో యాదవ్ సామజిక వర్గానికి చెందిన మీరంతా మీ మీ స్వస్ధలకు వచ్చి పార్టీ అభ్యర్థుల విజయం కొరకు పని చేయాలనీ విజ్ఞప్తి చేశారు.
kuwait
 
బి.మణి యాదవ్, బి. వెంకటేష్ యాదవ్, ఎస్. గంగాధర్ యాదవ్, ఎస్. నరసింహా యాదవ్, లు మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయములో మా సామజిక వర్గానికి ఇచ్చిన వాగ్దానాలలో  ఏ వాగ్దానం కుడా నెరవేర్చలేదని జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మా సామాజిక వర్గానికి న్యాయం జరుగుతోందని గట్టి నమ్మకం మాకు ఉందని వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కువైట్ కార్యవర్గ సభ్యులతో కలిసి ఎన్నికల సమయములో మా స్వస్దలకు వచ్చి పార్టీ అభ్యర్థుల విజయం కొరకు పనిచేస్తామని హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కువైట్ సభ్యులకు, మా సామాజిక వర్గం పెద్దలకు, వై.యస్.ఆర్. కుటుంబ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 
jagans fans
 
ఈ కార్యక్రమములో  టి. సుబ్రహ్మణ్యం యాదవ్, బాబు యాదవ్, వై. గోపాల్ యాదవ్, ఎన్. చంద్ర యాదవ్, కె. రామచంద్ర యాదవ్, రాజశేఖర్ యాదవ్, వై.  మురళి యాదవ్, యం. గోపాల్ యాదవ్, ఎన్. విజయ్ యాదవ్, రాజన్న యాదవ్, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గసభ్యులు,రెడ్డి సంక్షేమ సంఘం కువైట్ కార్యవర్గ సభ్యులు, మరియు భారీగా వైయస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.