జగనన్న యూత్ ఫోర్స్ కువైట్

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

jagananna youth force kuwait
Updated:  2018-05-14 18:22:58

జగనన్న యూత్ ఫోర్స్ కువైట్

కువైట్: ప్రజా సంక్షేమం కొరకు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ  రాష్ట్ర ప్రభుత్వం అరాచక పాలన గురించి ప్రజలకు వివరిస్తూ చేస్తున్న ప్రజా సంకల్పపాదయాత్ర 2000 వేల కి.మీ. మైలు పూర్తీ అయినందున జగనన్న యూత్ ఫోర్స్ సభ్యులు పోలి మనోహర్ , లక్ష్మీప్రసాద్, నరసింహులు, ఇక్బల్, నాసిర్, పవన్ కుమార్ తదితరులు నూతనంగా సంఘం ఏర్పాటు చేసి హవల్లి ప్రాంతం బైరుట్ వీధి స్కౌట్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో భారీ కేక్ కట్ చేసినారు,
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వైయస్ఆర్ సిపి కువైట్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు, గవర్నింగ్  కౌన్సిల్ సభ్యులు రెహామన్ ఖాన్, ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి ,  గవర్ని౦గ్  కౌన్సిల్సభ్యులు తెట్టు రఫీ పాల్గోన్నారు,  
 
ఈ సందర్భముగా జగనన్న యూత్ ఫోర్స్ వ్యవస్ధాపక అధ్యక్షుడు పోలి  మనోహర్ , అధ్యక్షులు లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ భగ భగ మండే సూర్యుడిని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజల సమస్యలే తనకు ముఖ్యమని ప్రజా సంకల్పపాదయాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రస్తుత రాష్ట్ర రాజకీయ నాయకులలో ప్రజా నాయకుడు ఎవరైనా ఉందంటే అది ఒక జగన్ మోహన్ రెడ్డి గారే అని తెలిపారు. 
 
వైయస్ఆర్ సిపి కువైట్ ముఖ్య  అతిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని 6 వందల ఉచిత, మోసపూరిత వాగ్దనాలతో అధికారంలో వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నాడని ఎద్దేవా చేశారు.మా అధినేత ప్రజల తరపున అలుపెరుగని వీరుడి వలే పోరాడుతున్న దారిలో మేమందరము కూడా భాగాస్వాములై మా వంతు కూడా పార్టీ అభ్యున్నితికి పాటు పడి 2019లో జగన్ మోహాన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం 2019 లో 25 పార్లమెంట్ సభ్యులను వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అందిస్తే కేంద్రం లో ఏ పార్టీ అధికారంలో ఉన్న మెడలు వంచి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు కేంద్రం నుండి తీసుకొనే అవకాశము ఉందని ఈ సందర్భముగా పత్రిక ద్వారా విజ్ఞప్తి చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.