ఘనంగా వైసీపీ కువైట్ కో కన్వీనర్ జన్మదిన వేడుకలు...

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

Updated:  2018-06-19 07:43:40

ఘనంగా వైసీపీ కువైట్ కో కన్వీనర్ జన్మదిన వేడుకలు...

ఓమరియా  ప్రాంతం పార్క్ లో నిరంతరం పార్టీ అభ్యున్నతి కొరకు పాటు పడే  వైసీపీ కువైట్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు 46వ జన్మదినాన్ని జగనన్న యూత్ ఫోర్స్ సభ్యులు, వై.యస్.ఆర్. కుటుంబ అభిమానుల మధ్య కేక్ కట్ చేయడం జరిగిందని జగన్ యూత్ ఫోర్స్ అధ్యక్షులు లక్ష్మి  ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. 
 
ఈ సందర్భముగా J. Y. F.అధ్యక్షులు లక్ష్మి  ప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్ర 2 వేల కి.మీ. మైలు రాయి దాటుతున్న సమయంలో కువైట్ లో కార్యక్రమము చేయాలనుకుని అడగ్గానే కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డితో మాట్లాడి మరియు ఇండియాలో ఉన్న గల్ఫ్  కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్ తో మాట్లాడి మా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి  సహాకారించినందుకు ఉడతా భక్తిగా గోవిందు నాగరాజు జన్మదిన కార్యక్రమము నిర్వహించామని తెలిపారు. 
 
గోవిందు నాగరాజు మాట్లాడుతూ నా జన్మదినాన్ని ఇంత అభిమానంగా మీరు చేయడం ఆనందంగా ఉందని నా జీవితాంతం నేను మరచిపోలేనని J. Y. F. సభ్యులు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 
 
ఈ కార్యక్రమములో గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్, గవర్ని౦గ్ కౌన్సిల్ సభ్యుడు పి. రెహామాన్ ఖాన్, ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి, సోషల్ మీడియా ఇంచార్చ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, J. Y. F.  కార్యవర్గ సభ్యులు మనోహర్ ,దినేష్, నరసింహులు ,ఇబ్దల్  నాసర్ .  పవన్ ,చిన్న తదితరాలు పాల్గొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.