వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరికలు

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

ysrcp kuwait
Updated:  2018-07-07 06:03:38

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరికలు

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి అధ్యక్షతన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ సి &ఎస్ టి ఇంచార్చ్  బి.ఎన్ సింహ, సభ్యులు పోలూరు ప్రభాకర్, సూర్యనారాయణ ఆధ్వర్యంలో వివిధ మతాలకు కులాలకు చెందిన దాదాపు 100 మంది వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ లో చేరినారు.
 
ఈ సందర్భం గా ముమ్మడి బాలి రెడ్డి గారు మాట్లాడుతు, దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో తీసుకెళతాము అని 2014 ఎన్నకల ప్రచారములో ఉదార కొట్టిన ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గెలిచినా తర్వాత రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేశారు. ముఖ్యముగా ముఖ్యమంత్రి గారు అయితే ఎన్నో వాగ్దానాలు చేసి. నాకు అందరి కన్న ఎక్కువ అనుభవం ఉంది అని. పిట్టల దొర మాదిరిగా ఏ దేశం పోతే ఆ దేశం లాగ రాష్ట్రాన్ని తాయారు చేస్తాను అని రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేంద్రం నుండి వచ్చిన నిధులు ఏ విధంగా దోచుకోవాలనే దానిపై ప్రాధాన్య ఇచ్చారు.
ysrcp
 
రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరికీ ఉందని ముఖ్యముగా ప్రసాంధ్రుల కుటుంబాలు మీ పై పూర్తిగా ఆధార పడి ఉంటాయి కాబట్టి మీ ఒక టెలిఫోన్ ద్వారా మీ కుటుంబ సభ్యుల ఓట్లు పార్టీకి పడతాయని రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే 2019 లో జన నేత జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఎస్ సి &ఎస్ టి లీడర్ బి.ఎన్ సింహ మాట్లాడుతూ జివోనాపాధి కొరకు వరకు కువైట్ వచ్చిన మీరందరు   ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రం బాగా పడాలంటే ఒకే ఒక్కడు జగన్ మోహన్ రెడ్డి గారికే సాధ్యమని నమ్మకంతో వీరంతా పార్టీ కమిటీలో చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు  తెలిపారు. 
 
కమిటీ లో చేరిన వారందరు పార్టీ అభ్యున్నితికి పని చేస్తామని ముక్త కంఠముతో వాగ్దానం చేశారు.రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని 6 వందల ఉచిత, మోసపూరిత వాగ్దనాలతో అధికారంలో వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నాడని ఎద్దేవా చేశారు. మా అధినేత ప్రజల తరపున అలుపెరుగని వీరుడి వలే పోరాడుతున్న దారిలో మేమందరము కూడా భాగాస్వాములై మా వంతు కూడా పార్టీ అభ్యున్నితికి పాటు పడి 2019లో జగన్ మోహాన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొద్దాం.
kuait ysrcp  
 
కోకన్వీనర్ గోవిందు నాగరాజు  ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి  మాట్లాడుతూ జననేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుకుంటున్నారు అందుకు నిదర్శనమే జగన్ గారు చేస్తున్న పాదయాత్రకు ప్రజలచూపుతున్న ఆదరణ. ప్రస్తుత తెలుగుదేశం పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. 
 
ఈ కార్యక్రమములో గవర్ని0గ్ కౌన్సిల్ సభ్యులు పి. రెహామన్ ఖాన్, లలిత రాజు, తెట్టు రఫీ, అధికార ప్రతినిధి  ఆకుల ప్రభాకర్ రెడ్డి పి. సురేష్ రెడ్డి పిడుగు సుబ్బారెడ్డి,  సోషల్ మీడియా ఇంచార్చ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, సలహాదారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, షేక్. రహమతుల్లా, కె. నాగసుబ్బారెడ్డి,  హరినాథ్ చౌదరి, షేక్ గౌస్ 
రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు బత్తిన శివ రెడ్డి చింతల చంద్రశేఖర్ రెడ్డి ఎన్ శ్రీనివాసులు రెడ్డి 
జగనన్న యూత్ ఫోర్స్ అధ్యక్షులు లక్ష్మీప్రసాద్ నరసింహ యాదవ్ దినేష్ మహేష్ యాదవ్,ఎగ్బల్ బాషా , ఒ. మోహాన్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.