కువైట్‌లో భార‌త రాయ‌బారితో వైసీపీ భేటీ

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

kuwait ycp leaders
Updated:  2018-06-15 12:28:04

కువైట్‌లో భార‌త రాయ‌బారితో వైసీపీ భేటీ

కువైట్: వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కువైట్ సభ్యుల ఆధ్వర్యములో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు కువైట్ వచ్చిన కమలాపురం శాసన సభ్యులు పి. రవింద్రనాధ్ రెడ్డి గారు, కడప శాసన సభ్యులు ఎస్.బి. అంజాద్ బాషా గారు కువైట్ లో ఉన్న భారత రాయబార కార్యాలయానికి వెళ్లి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన రాయబారి జీవసాగర్ గారిని కలిసి కువైట్ లో తెలుగు వారు ఎదురుకుంటున్న సమస్యల గురించి వివరించారని అధికార ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 
 
ఈ సందర్భముగా వారివురు రాయబారి జీవ సాగర్ గారితో మాట్లాడుతూ కువైట్ లో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కువైట్ సభ్యులు వారు పలు సామజిక సేవలు చేస్తూ  తెలుగు వారిని ఏ విధంగా ఆదుకుంటుందో వివరంగా తెలిపారు. 
 
కువైట్ మన ఆంధ్ర వారు సుమారు 5 లక్షల మంది ఉన్నారు కేవలం కడప జిల్లా సుమారు 1 లక్ష 50 వేలు ఉన్నారని. కువైట్ లో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి పార్థివశరీరాన్ని స్వస్దలం పంపించాలంటే సుమారు 1 లక్ష వరకు ఖర్చు వస్తుంది  పేద వారు ఆ ఖర్చును భరించ లేరు దయచేసి ఆ ఖర్చును భారత రాయబార కార్యాలయం భరించేటట్లు చేసేది, కువైట్ ఇంట్లో పనిచేసే దానికి వచ్చే వారికి కొందరు స్పాన్సర్ చాల ఇబ్బంది పెడుతుంటారు వారిని ఆడుకొని ఎటువంటి కేసులు లేకుండా ఇండియాకు పంపండి.
kuwait ycp leaders
 
కొత్తగా ఇండియా నుండి మహిళలు రావాలంటే కువైట్ స్పాన్సర్ మన ప్రభుత్వానికి ( అంబాసికి ) సుమారు 2 లక్షలు డిపాజిట్ కట్టాలని నిబంధన ఉంది దాని వలన స్పాన్సర్స్ ఇండియా మహిళను వీసా  ఇవ్వాలంటే భయపడు  తున్నారు కాబట్టి 2 లక్షల డిపాజిట్ ను తగ్గించండి. 
 
ఇంట్లో డ్రైవర్ గా హౌసెమైడ్  గా కువైట్ కు పిలిచి ఆ పని ఇవ్వకుండా ఎడారిలో గొర్రెలు మేపేదానికి నియమిస్తున్నారు ఇటువంటి వారు ఎడారిలో పనిచేయకుండా కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది అటువంటి వారికి రక్షణగా వారిని స్వస్దలం పంపే ఏర్పాట్లు చేయాలనీ శాసన సభ్యులు పి. రవింద్రనాధ్ రెడ్డి, ఎస్.బి. అంజాద్ బాషా పాటు   గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ రాయబారి జీవ సాగర్ గారిని అభ్యర్ధన చేశారు. 
 
రాయబారి  జీవ  సాగర్  గారు సానుకూలంగా స్పందించి తప్పకుండా మీ అభ్యర్ధనను పరిశీలిస్తామని తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.