క్షమాభిక్ష ద్వారా స్వస్ధలం వెళుతున్న వారిని ఆదుకోవాలి....

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

Updated:  2018-02-23 12:31:14

క్షమాభిక్ష ద్వారా స్వస్ధలం వెళుతున్న వారిని ఆదుకోవాలి....

కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష ద్వారా స్వస్ధలం వెళుతున్న వారికి ఆదుకోవాలని రాష్ట్ర మంత్రివర్యులు కోల్లు రవీంద్ర గారి వినతి పత్రం అందించిన వైయస్ఆర్ కాంగ్రెస్ సిపి కువైట్ కమిటీ సభ్యులు.                  
కువైట్ : కువైట్ ప్రభుత్వం గత నెల 29 - 01 - 18 న ఆఖమా  లేని వారు ఏజంట్ల చేతిలో మోసపోయి పాస్ పోర్ట్ లేని వారు ఎటువంటి కేసులు మరియు జరిమానా లేకుండా వెళ్లి మళ్ళి కొత్త వీసా పై కువైట్ వచ్చే అవకాశము ఉన్నందున కువైట్ లో ఉన్న 9 వేల మంది అభాగ్యులు 7 సం : ల తరవాత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న టికెట్లకు డబ్బులు అవస్ధలు పడుతున్న అభాగ్యలు ఎంతోమంది ఉన్నారు..
kuwair ysrcp committee
 
ఇటువంటి అభాగ్యులను రాష్ట్ర  ప్రభుత్వం ఆదుకోవాలని గతంలో పత్రిక ముఖంగా ఆదుకోవాలని గల్ఫ్,కువైట్ ప్రతినిధులు APNRT మరియు ప్రభుత్వం పై విమర్శించగా ఎట్టకేలకు ప్రభుత్వం తరపున రాష్ట్ర యన్ ఆర్ ఐ మంత్రి వర్యులు శ్రీ. కొల్లు రవీంద్ర గారు APNRT ( ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్సీ తెలుగు ) చెర్ పర్సన్ వేమూరి రవి గారు20 - 02 - 18 న  కువైట్ విచ్చేసిన సందర్బంగా తెలుగు వారి తరుపున వై యస్ ఆర్ సిపి కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి గారు కమిటీ సభ్యులతో మర్యాద పూర్వకంగా కలిసితెలుగువారి కష్టాలపైన  వినతి పత్రం ఇచ్చారు..
 
ఈ సందర్భముగా బాలిరెడ్డి గారు మాట్లాడుతూ క్షమాబిక్ష సమయములో ఇండియా వచ్చిన అభాగ్యులను అన్ని విధాలుగా ఆదుకొని వారికీ పునరావాసం కల్పించాలని మరియు  ఇక్కడ నుండి వెళ్లే పేద వారికి టికెట్లుప్రభుత్వతరుపున ఆదుకోవాలని అలాగే మన తిరుపతి విమానాశ్రయం లో అంతర్జాతీయ విమానాలు దిగేనట్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని మనవి చేసిన్నారు.
 
కో కన్వినర్లు గోవిందు నాగరాజు యం.వి నరసారెడ్డి మాట్లాడుతు కువైట్ లో పని చేస్తున్నపుడు అకస్మాత్తుగా మరణించిన వారి పార్ధవశరీరాన్ని భారత దేశం లోని విమానాశ్రయం తమ స్వస్థలకి ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని మరియు కువైట్ వచ్చిన పేద బడుగు వర్గాల  వారి  కుటుంబాలకు సంక్షేమ పధకాలను రద్దు చేయవద్దు అని కోరిన్నారు.
 
ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి మీడియా ప్రతినిది ఆకుల ప్రభాకర్ మాట్లాడుతూ  కువైట్ ప్రమాదం లో మరణించిన వారికీ మరియు ప్రమాదం లో వికలాంగులు అయిన వారికీ భీమా ద్వారా ఆదుకోవాలి అని మరియు దొంగ ఏజంట్ల నుండి అమాయక ప్రజలను రక్షించాలని కోరిన్నారు.
 
ఈ కార్యక్రమం లో సలహాదారులు అబుతురాబ్, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ,బిసి విభాగం లీడర్ రమణ యాదవ్, యువజన విభాగం లీడర్ మర్రి కళ్యాణ్, యసి యస్టి విభాగం బి యన్ సింహ, పిడుగు సుబ్బారెడ్డి,షేఖ్ సబ్దర్ తదితరులు పాల్గొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.