మ‌ర‌ణించిన వారిని ఆదుకున్న వైసీపీ కార్య‌క‌ర్త‌లు

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

kuwait ysrcp leaders
Updated:  2018-06-05 04:10:40

మ‌ర‌ణించిన వారిని ఆదుకున్న వైసీపీ కార్య‌క‌ర్త‌లు

కువైట్: గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్, గారు తెలిపిన వివరాల ప్రకారం  వైయస్ఆర్. జిల్లా చాపాడు మండలం ఉప్పలకొట్టు, ఎస్.టి. సోమాపురం కు చెందిన పెద్ద ఓబులేసు ( 46 ) 30 - 05 - 18న ఆకస్మికంగా మరణించారు. ఈ విషయాన్ని కడప పార్లమెంట్ సభ్యులు వై.యస్. అవినాష్ రెడ్డి గారు, మైదుకూరు శాసన సభ్యులు సి. రాఘురామి రెడ్డి గారు కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి గారికి ఇండియా పంపే ఏర్పాట్లు చేసి పేద కుటుంబం ఆర్ధికంగా ఆదుకోవాలని అభ్యర్ధించగా వెంటనే స్పందించి సేవాదళ్ ఇంచార్చ్ గోవిందు రాజు గారి చేత ఇండియన్ అంబాసి మరియు కువైట్ ఇమిగ్రేషన్ పనులన్ని పూర్తి చేసి పార్ధివదేహాన్ని ఎమిరేట్స్ ద్వారా 31 - 05 - 18 న ఇండియాకు పంపించారు.టికెట్ డబ్బులు బంధు మిత్రులు భరించారు. 
 
బాడీ బాక్స్ డబ్బులు సుమారు 12 వేలు రూపాయలు (60 kd) బాలిరెడ్డి గారు ఇచ్చారు, ప్రముఖ సామాజిక వేత్త వై.వి. భాస్కర్ రెడ్డి 4వేల 250 రూపాయలు, హనుమంత్ రెడ్డి 2వెల 125 రూపాయలు ఇచ్చారు, అంబులెన్స్ డబ్బులు 10 వేలు మరియు 22 వేలు రూపాయలు,  వైయస్ఆర్ సీపీ కువైట్ కమిటి సభ్యులు ఇచ్చారు. రెడ్డి సంఘం కువైట్ కమిటి తరపున మరియు కమిటి సభ్యులు 22 వేలు ఇచ్చారు మొత్తం నగదు 43 వేల 988 రూపాయలు పెద్ద ఓబులేసు భార్య మల్లేశ్వరమ్మ బ్యాంక్ అకౌంట్ లో వేసి రశీదును ఆమె బంధువు కు అందచేశారు. 
 
ఈ సందర్భముగా ఇలియాస్ మరియు బాలిరెడ్డి గారు మాట్లాడుతూ, ఆర్ధిక సహాయం అందించిన రెడ్డీస్ కమిటి సభ్యులకు మరియు వైయస్ఆర్ సీపీ కువైట్ కమిటి సభ్యులకు పెద్ద ఓబులేసు కుటుంబ సభ్యుల ద్వారా కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. 
 
ఈ కార్యక్రమములో రెడ్డీస్ సంఘం కువైట్ గౌరవ అధ్యక్షులు మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షులు బత్తిన శివారెడ్డి, ఉపాధ్యక్షులు పులపుత్తూరు సురేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నూకారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వైయస్ఆర్ సీపీ కువైట్ కమిటి   కో కన్వీనర్ గోవిందు నాగరాజు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి.రెహామన్ ఖాన్, ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి,  గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు తెట్టు రఫీ, సలహాదారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సోషల్ మీడియా ఇంచార్చ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కోశాధికారి పిడుగు సుబ్బారెడ్డి, మరియు హనుమంత్ రెడ్డి, వజ్రశేఖర్ రెడ్డి పాల్గోన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.