కువైట్ ప్రభుత్వం క్షమాబిక్ష.. స్వ‌దేశం వేళ్లేందుకు వైసీపీ స‌హ‌కారం

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

Updated:  2018-02-18 06:53:56

కువైట్ ప్రభుత్వం క్షమాబిక్ష.. స్వ‌దేశం వేళ్లేందుకు వైసీపీ స‌హ‌కారం

భారత రాయబార కార్యాలయం వద్ద కమిటీ సభ్యుల సహాకారంతో పోలి బుజ్జమ్మ   వెంకటరెడ్డి పల్లి అరుంధతి వాడ, పెంచల సురేష్  గిరిజన కాలనీ వెంకటరెడ్డి పల్లె , గంపల నారాయణ    బైనపల్లి యస్ సి కాలనీ, ఈ ముగ్గురికి టికెట్స్  భారత  కార్యాలయ  అధికారి సెకండ్ సెక్రెటరీ  నారాయణ స్వామి ద్వారా  ఇవ్వడం  జరిగిందని  వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ   గల్ఫ్  , కువైట్  కన్వీనర్లు  ఇలియాస్  బి. హెచ్.  ముమ్మడి  బాలిరెడ్డి    ఒక  ప్రకటనలో  తెలిపారు.
 
ఈ  సందర్భముగా  బాలిరెడ్డి   మాట్లాడుతూ......    29 - 01 - 18 - నుండి    అకామా  ( రెసిడెన్సీ  ) లేని వారు  స్వస్ధాలకు  వెళ్లిపోవచ్చు  అని  కువైట్  ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి ప్రతి  రోజు  భారత  కార్యాలయము  వద్ద  వచ్చి  తెలుగు  వారికి సహాకారం  అందిస్తూ...  ఈ  ముగ్గురికి కూడా  అవుట్  పాస్  తయారు  చేయడమే  కాక  కమిటీ  సభ్యులు  మరియు  దాతల   సహాకారంతో  ఈ  ముగ్గురికి  ఉచిత  టికెట్స్ ఇప్పించిన  మా  ప్రధాన  కోశాధికారి  నాయని  మహేశ్వర్  రెడ్డికి   కమిటీ  సభ్యుల  తరపున  అభినందనలు  తెలిపారు.  
 
మహేశ్వర్  రెడ్డి  మాట్లాడుతూ...  ఇంతవరకు  రాష్ట్ర  ప్రభుత్వం  తరపు  నుండి  ఎటువంటి  సహాయం  అందక  పోవడం  సిగ్గు  చేటని  తెలంగాణ  ప్రభుత్వం  తరపున  అధికారులు  కువైట్  వచ్చి తెలంగాణ  వారికి  సహాకారం  అందించడం  అభినందయమని  తెలిపారు. ఈ  కార్యక్రమములో  కో  కన్వీనర్లు  గోవిందు  నాగరాజు, యం . వి.  నరసా  రెడ్డి, గవర్నింగ్  కౌన్సిల్   సభ్యుడు   పి . రెహమాన్  ఖాన్, మీడియా  ఇంచార్చ్  ఆకుల  ప్రభాకర్  రెడ్డి, బి.సి.  ఇంచార్చ్ రమణ  యాదవ్, లలితారాజ్, యూత్  ఇంచార్చ్  మర్రి  కళ్యాణ్  , మైనారిటీ  సభ్యుడు  షేక్  రహామతుల్లా  తదితరులు  పాల్గొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.