జిన్‌పింగ్‌కు జీవితకాల అధ్యక్ష హోదా

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

gingping image
Updated:  2018-03-11 05:55:48

జిన్‌పింగ్‌కు జీవితకాల అధ్యక్ష హోదా

చైనా అధినేత‌గా ఉన్న‌టువంటి జిన్‌పింగ్‌కు జీవిత‌కాలం అధ్య‌క్షుడిగా ఉండే అవ‌కాశం వ‌రించింది. చైనాలో ఎవ‌రైనా అధ్య‌క్ష‌ప‌ద‌విని కేవ‌లం రెండుమార్లు మాత్ర‌మే అధిష్టించే విధానం అమ‌లులో ఉండేది. అయితే గ‌తంలో ఈ విధానాన్ని చైనా పొలిట్‌ బ్యూరో తిర‌స్క‌రించింది. అందుకు అనుగుణంగా తాజాగా ఓటింగ్ నిర్వ‌హించింది నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌. అందులో మొత్తం 2,964 ఓట్లు ఉండ‌గా మూడు గైర్హాజరు కాగా రెండు ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. మిగిలిన అన్ని ఓట్లు జిన్‌పింగ్‌కు సానుకూలంగా వ‌చ్చాయి. ఈ విధానాన్ని చ‌ట్టం చేసింది నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్ పార్టీ.
 
జిన్‌పింగ్ 2023లో పదవీ విరమణ చేయ‌నుండటంతో అధ్యక్ష పదవికి ఉన్న రెండు పర్యాయాల నిబంధనను తొలగించాలని ఫిబ్రవరిలో నిర్ణయించారు.అప్ప‌టి నుంచి దీన్ని చ‌ట్ట రూపంలోకి తీసుకురావ‌డానికి షీ ప్ర‌య‌త్నాలు జ‌రిపారు. గ‌త యేడాది జ‌రిగిన చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ సమావేశంలో జిన్‌పింగ్‌ దేశంలోనే సర్వశక్తిమంతుడిగా ఎదిగారు. దీంతో పార్టీ సిద్దాంతాల‌ను మార్చే హ‌క్కును క‌ల్పించారు. దీంతో చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌తో సమానమైన హోదా పొందినట్లైంది. చైనాలో చ‌ట్ట ప్ర‌కారం అంతిమ నిర్ణ‌యం తీసుకునే కాంగ్రెస్ సైతం దీన్ని ఆమోదించింది.
 
ఇలాంటి నిర్ణ‌యాల వ‌ల్ల దేశంలో రాజ‌రికం ఏర్ప‌డుతుంద‌ని దీని పై పోరాటం చేయ‌క త‌ప్ప‌ద‌ని ప‌లువురు ప్ర‌జ‌లు, పాత్రికేయులు వెల్ల‌డిస్తున్నారు. ఈ నిర్ణ‌యాన్ని అహ్వానిస్తు త‌మ దేశంలో కూడా ఇలాంటి విధానం తీసుకురావాల‌ని  అగ్ర‌రాజ్య అధ్య‌క్షుడు డోనాల్ట్ ట్రంప్ అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.