మైనార్టీలకు న్యాయం చేసింది రాజశేఖర్ రెడ్డి మాత్రమే...

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

Updated:  2018-07-25 01:43:47

మైనార్టీలకు న్యాయం చేసింది రాజశేఖర్ రెడ్డి మాత్రమే...

మైనార్టీలకు న్యాయం చేసింది రాజశేఖర్ రెడ్డి మాత్రమే...
 
వైసీపీ కువైట్ ముస్లిం మైనార్టీ విభాగం ఇంచార్చ్ షేక్ గఫార్ ఆధ్వర్యములో కడప పార్టీ ఆఫీసులో ముస్లిం మైనార్టీ NRIల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్. అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శాసన సభ్యులు రవింద్రనాధ్ రెడ్డి, ఎమ్మెల్యే అంజాద్ బాషా,  కడప పార్లమెంట్ ఇంచార్చ్ కడప మేయర్ కె. సురేష్ బాబు పాల్గోన్నారు .
 
ఈ సందర్భముగా షేక్ గఫార్ మాట్లాడుతూ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ సలహా సూచనలతో మైనార్టీ విభాగంలో కువైట్ లో ఉన్న రాష్ట్ర మైనారిటీ సోదరులను కమిటీలో చేర్పించి కమిటీ పార్టీ అభ్యున్నితి పాటు పడతానని హామీ ఇచ్చారు.
ఇలియాస్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలు రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలను నమ్మే పరిస్ధుతులు లేవని ముస్లిం మాట్లాడే ఉర్దూ భాషను రాష్ట్రంలో లేకుండా చేయాలనీ చూస్తున్నాడని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన చంద్రబాబుకు ముస్లిం సోదరులు బుద్ధి చెబుతారన్నారు.
 
ముఖ్య అతిధితులు రవింద్రనాధ్ రెడ్డి, అంజాద్ బాషా, సురేష్ బాబు మాట్లాడుతూ సంయుక్త రాష్ట్ర ఆవిర్భావం నుండి ముస్లిం మైనార్టీల అభ్యున్నితి కొరకు పని చేసిన ఏకైక నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి. వారి ఆశయ సాధన కొరకు వైసీపీని స్ధాపించిన అధినేత జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి కన్నా ఇంకా గొప్పగా మైనార్టీ ముస్లింల అభ్యున్నితి కొరకు పనిచేస్తారని నమ్మకం ఉంది. 2019 లో ఏ పార్టీతో పొత్తు ఉండదని తెలుగుదేశం పార్టీ నాయకుల అబద్ధపు మాటలను ముస్లిం సోదరులు నమ్మ వద్దని అభ్యర్ధన చేశారు. 
 
ఈ సమావేశంలో గల్ఫ్ ప్రతినిధి జి.ఎస్. బాబు రాయుడు, వై.యస్.ఆర్ సీపీ  కువైట్ యూత్ ఇంచార్చ్ మర్రి కళ్యాణ్, మైనారిటీ సభ్యుడు షేక్ రహమతుల్లా, పట్టణ అధ్యక్షుడు పులి సునీల్, జిల్లా పట్టణ మైనారిటీ అధ్యక్షులు కరీముల్లా, షఫీ ప్రసంగించారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.